ఆర్‌వోఆర్‌పై ముగిసిన ప్రజాభిప్రాయ సేకరణ
అన్ని వర్గాల ప్రజలూ అభిప్రాయాలను వెల్లడించారు
జిల్లా స్థాయిల్లో వచ్చిన సూచనలను కలెక్టర్లు నివేదిస్తారు
క్రోడీకరించిన తర్వాత కొత్త చట్టం అమలు: మంత్రి పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్‌వోఆర్)–2024 చట్టం ముసాయిదాపై ప్రజాభిప్రాయ సేకరణ ముగిసిందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. ఈ అభిప్రాయ సేకరణలో మేధావులు, రిటైర్డ్ రెవె న్యూ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, రైతుల నుంచి సామా న్యుల వరకు అందరూ తమ సల హాలు, సూచనలను ప్రభు త్వానికి ఇచ్చారని ఆయన తెలిపారు. ఈ అభిప్రాయాలన్నింటినీ క్రోడీకరించి కొత్త ఆర్‌వోఆర్ చట్టాన్ని అందుబా టులోకి తెస్తామని, ఇందుకు అవసరమైన కసరత్తును త్వరి తగతిన పూర్తి చేస్తామని శనివారం ఒక ప్రకటనలో ఆయన వివరించారు.
రాష్ట్రంలో భూమి సమస్యలకు శాశ్వత పరి ష్కారమే లక్ష్యంగా, భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని, తెలంగాణ ప్రజల దశాబ్దాల ఆకాంక్షకు అనుగుణంగా కొత్త చట్టాన్ని తెస్తామని స్పష్టం చేశారు. ’’తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక భూ సమస్యలు పరిష్కారమవుతాయని అనుకుంటే గత పాలకుల తొందరపాటు నిర్ణయాలతో కొత్త సమస్యలు ఉత్పన్న మయ్యాయి. బీఆర్‌ఎస్ ప్రభుత్వం తెచ్చిన ఆర్‌వోఆర్ చట్టం లోపభూయిష్టంగా ఉండడంతో రైతులు, భూముల యజమానులు పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు.
తప్పుల తడకగా సేకరించిన వివరాలతో నిర్వహించిన ధరణి పోర్టల్‌కు 30 లక్షల మంది రైతులు బాధితులుగా మారారు. అటువంటి పరిస్థితులను పునరావృతం కానివ్వం. తాము రూపొందించిన ఆర్‌వోఆర్ ముసాయిదా చట్టంపై విస్తృత స్థాయిలో ప్రజాభిప్రాయ సేకరణ జరిపాం. జిల్లా స్థాయిలో వర్క్‌షాప్‌లు నిర్వహించాం. ఆ వర్క్‌షాప్‌లలో వచ్చిన సూచనలను కలెక్టర్లు నివేదిక రూపంలో పంపుతారు. ప్రజల నుంచి ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా, ఈమెయిల్ రూపంలో వచ్చిన సూచనలను కూడా వాటితో క్రోడీకరిస్తాం.
అమలు చేసే అధికారులకు అవగాహన ఉండేలా, రైతులకు అర్థమయ్యే రీతిలో అవినీతి రహిత చట్టాన్ని తీసుకురాబోతున్నాం. గత ప్రభుత్వ హయాంలో అత్యంత రహస్యంగా ఉంచిన ధరణి పోర్టల్‌ను మా ప్రభుత్వం ఒక పబ్లిక్ డాక్యుమెంట్‌గా ప్రజలందరికీ అందుబాటులో ఉంచబోతోంది.’ అని ఆ ప్రకటనలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment