మంత్రి పొంగులేటి నివాసంలో ఈడీ సోదాలు | ED Conducts Raids In Hyderabad Include Ponguleti Srinivas House On Sep 27 Updates In Telugu | Sakshi
Sakshi News home page

ED Raids In Hyderabad: మంత్రి పొంగులేటి నివాసంలో ఈడీ సోదాలు

Published Fri, Sep 27 2024 10:03 AM | Last Updated on Fri, Sep 27 2024 11:32 AM

ED Conducts Raids HYD include Ponguleti House Sep 27 Updates

హైదరాబాద్‌, సాక్షి: తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సోదాలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన 16 బృందాలు.. ఏకకాలంలో 16 చోట్ల తనిఖీలు చేపట్టాయి. 

శుక్రవారం తెల్లవారుజాము నుంచి పొంగులేటి నివాసం, ఆయన వ్యాపార సంస్థల కార్యాలయాల్లో ఈడీ బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. ఆయన అనుచరులకు సంబంధించిన నివాసాలు, ఆఫీసుల్లోనూ తనిఖీలు జరుగుతున్నాయి. కస్టమ్స్‌ డ్యూటీ ఎగవేత కేసులో నేపథ్యంతోనే ఈ సోదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ రైడ్స్‌కు సంబంధించి అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.

పొంగులేటి ఇంట్లో ఈడీ సోదాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement