
సెన్సార్ పూర్తి చేసుకొన్న 'ఘాజి'
క్లీన్ 'యు' అందుకొని.. ఫిబ్రవరి 17 విడుదలకు సిద్ధం
రానా, తాప్సీ, కే.కే.మీనన్, అతుల్ కుల్కర్ణి ముఖ్యపాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం 'ఘాజి'. 1970లో జరిగిన యుద్ధ నేపధ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని పివిపి సినిమా, మ్యాటినీ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సంకల్ప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజు(గురువారం) సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని 'క్లీన్ యు' సర్టిఫికెట్ అందుకొంది.