జెంటిల్మేన్కు యు సర్టిఫికేట్ | Nani gentleman censor completed | Sakshi
Sakshi News home page

జెంటిల్మేన్కు యు సర్టిఫికేట్

Published Sat, Jun 11 2016 12:57 PM | Last Updated on Mon, Sep 4 2017 2:15 AM

జెంటిల్మేన్కు యు సర్టిఫికేట్

జెంటిల్మేన్కు యు సర్టిఫికేట్

వరుస సక్సెస్లతో మంచి ఫాంలో ఉన్న యువ నటుడు నాని హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ ఎంటర్టైనర్ జెంటిల్మేన్. తనను హీరోగా పరిచయం చేసిన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో చాలా కాలం తరువాత నాని చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా ప్రమోషన్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు చిత్రయూనిట్.

ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్లలో నాని హీరోనా..? విలనా..? అంటూ, ప్రశ్నలతో అభిమానులకు సినిమా మీద ఆసక్తిని పెంచేస్తున్నారు. ప్రజెంట్ అన్ని ఇండస్ట్రీలలో సక్సెస్ ఫార్ములాగా మారిని థ్రిల్లర్ జానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. క్లీన్ యు సర్టిఫికేట్ సొంతం చేసుకున్న జెంటిల్మేన్, ఈ నెల 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement