
సెన్సార్ పూర్తి చేసుకున్న జై లవ కుశ
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ డ్రామా జై లవ కుశ. ఎన్టీఆర్ తొలిసారిగా త్రిపాత్రాభినయం చేసిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పవర్ ఫేం బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాశీఖన్నా, నివేదా థామస్ లు హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా బుధవారం (13-09-2017) సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.
ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు యు/ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. 2 గంటల 35 నిమిషాల నిడివితో రిలీజ్ అవుతున్న జై లవ కుశ ఎన్టీఆర్ అభిమానులను ఖుషీ చేస్తుందన్న ప్రచారం జరుగుతోంది. ఈ నెల 21న ప్రపంచవ్యాప్తంగా భారీ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఆడియోకు మంచి రెస్పాన్స్ రావటంతో సినిమా మీద కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.