సినిమా మొత్తం ఓకే ఒక పాత్ర.. ప్రయోగాత్మకంగా ‘హలో మీరా’ | Hello Meera Movie Release Date Out | Sakshi

సినిమా మొత్తం ఓకే ఒక పాత్ర.. ప్రయోగాత్మకంగా ‘హలో మీరా’

Apr 1 2023 5:18 PM | Updated on Apr 1 2023 5:29 PM

Hello Meera Movie Release Date Out - Sakshi

ఒక సినిమా అంటే ఎన్నో రకాలు పాత్రలు ఉంటాయి. అలా ఉంటేనే సినిమాను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారని, రెండున్నర గంటలు ఎంటర్‌టైన్‌ చేయొచ్చని అంతా అనుకుంటారు. కానీ పరిమితమైన పాత్రలతోనూ అద్భుతాలు చేయొచ్చని ఇది వరకు ఎన్నో సార్లు నిరూపితమైంది. అయితే ఇప్పుడు తెలుగులో మరో ప్రయత్నంగా  గార్గెయి యల్లాప్రగడ   నటిస్తున్న హలో మీరా అనే సినిమా రాబోతోంది. ఒకే ఒక పాత్రతో సినిమాను తెరకెక్కించడం సాహసమనే చెప్పాలి. కాకర్ల శ్రీనివాసు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లూమియర్ సినిమా బ్యానర్‌పై జీవన్ కాకర్ల సమర్పణలో.. డా. లక్ష్మణరావు  దిక్కల, వరప్రసాదరావు దుంపల, పద్మ కాకర్ల నిర్మిస్తున్నారు. 

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్, ట్రైలర్, పాటలు, పోస్టర్లు మంచి స్పందన లభించింది. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్‌డేట్‌ వచ్చింది. తాజాగా ఈ సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 21న విడుదల చేయబోతోన్నట్టుగా మేకర్లు ప్రకటించారు. ఇకపై మరింతగా ప్రమోషన్ కార్యక్రమాలు పెంచబోతోన్నట్టుగా నిర్మాతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement