
లాస్ట్ వర్కింగ్ డే : రాజమౌళి
నాలుగేళ్లకు పైగా బాహుబలి సినిమాకే అంకితమై పోయిన రాజమౌళికి ఎట్టకేలకు విముక్తి లభించింది. వంద కోట్ల బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన బాహుబలికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ విషయాన్ని అభిమానలుతో పంచుకుంటూ దాదాపు ఇదే లాస్ట్ వర్కింగ్ డే అంటూ ట్వీట్ చేశాడు రాజమౌళి. ఈ ప్రయాణంలో ఆనందంగా నవ్వుకున్న సందర్భాలు బాధతో ఒళ్లు జలదరించిన అనుభవాలు ఎన్నో ఉన్నాయంటూ గుర్తు చేసుకున్నాడు.
ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2 తెలుగు వర్షన్ సోమవారం సెన్సార్ ఫార్మాలిటీస్ కూడా పూర్తి చేసుకుంది. తమిళ, మలయాళ, హిందీ వర్షన్ సెన్సార్ పూర్తి కావాల్సి ఉంది. భారీ గ్రాఫిక్స్, యుద్ధ సన్నివేశాలతో తెరకెక్కిన ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ యు/ఎ సర్టిఫికేట్ ను జారీ చేసింది. సినిమా నిడివి రెండు గంటల 45 నిమిషాలుగా తెలుస్తోంది. రిలీజ్ విషయంలోనూ సరికొత్త రికార్డ్ లు క్రియేట్ చేస్తున్న బాహుబలి ఈ నెల 28న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది.
Last working day......hope fully..🙂
— rajamouli ss (@ssrajamouli) 18 April 2017
What a journey..what an experience..
I am both smiling with joy and wincing with pain..