ప్రొడక్షన్‌ టు డైరక్షన్‌ | tanniru vishwanath about m6 movie | Sakshi
Sakshi News home page

ప్రొడక్షన్‌ టు డైరక్షన్‌

Published Tue, Feb 4 2020 5:59 AM | Last Updated on Tue, Feb 4 2020 5:59 AM

tanniru vishwanath about m6 movie - Sakshi

విశ్వనాథ్‌ తన్నీరు

సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘యమ్‌ 6’ చిత్రాన్ని నిర్మించిన విశ్వనాథ్‌ తన్నీరు దర్శకుడిగా మారారు. విశ్వనాథ్‌ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్‌పై ఓ సినిమాకి దర్శకత్వం వహిస్తూ, నిర్మిస్తున్నారు కూడా. ‘‘సినిమా మీద ప్యాషన్‌తో ఇండస్ట్రీకి వచ్చాను.‘యమ్‌ 6’తో నిర్మాతగా మారాను. దర్శకుడిని కావాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. మంచి కథ కుదిరింది. ఈ సినిమా ద్వారా ఓ సందేశం కూడా ఇస్తున్నాం. ‘యమ్‌ 6’లో హీరోగా «నటించిన ధృవ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. హైదరాబాద్, వైజాగ్, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరిస్తాం’’ అన్నారు విశ్వనాథ్‌ తన్నీరు. ‘‘రెండోసారి కూడా అవకాశం ఇచ్చిన విశ్వనాథ్‌గారికి ధన్యవాదాలు’’ అన్నారు ధృవ. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement