ధృవ కోసం మరో సినిమా వాయిదా | Sundaranga Jaana release postponed For dhruva | Sakshi
Sakshi News home page

ధృవ కోసం మరో సినిమా వాయిదా

Published Wed, Dec 7 2016 1:45 PM | Last Updated on Mon, Sep 4 2017 10:09 PM

ధృవ కోసం మరో సినిమా వాయిదా

ధృవ కోసం మరో సినిమా వాయిదా

బ్రూస్లీ లాంటి డిజాస్టర్ తరువాత రామ్చరణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ధృవ. తమిళ సినిమా తనీ ఒరువన్కు రీమేక్గా తెరకెక్కుతున్న ఈ సినిమా మీద యూనిట్ సభ్యులతో పాటు రామ్చరణ్ కూడా భారీ ఆశలు పెట్టుకున్నాడు. అందుకు తగ్గట్టుగా స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్గా ధృవ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. రామ్చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తుండగా, ఒరిజినల్ వర్షన్లో విలన్గా నటించిన అరవింద్ స్వామి ఈ సినిమాలో కూడా ప్రతినాయక పాత్రలో నటించాడు.

ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. అయితే తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటకలలో కూడా భారీ రిలీజ్కు  ప్లాన్ చేసిన నిర్మాత అల్లు అరవింద్, ప్రస్తుతం ఈ సినిమాకు లైన్ క్లియర్ చేసే పనిలో ఉన్నాడు. అందుకోసం ఇప్పటికే తమిళ స్టార్ హీరో సూర్య సినిమా సింగం 3ని వారం పాటు వాయిదా వేయించాడు.

తాజాగా ఓ కన్నడ సినిమాను కూడా వాయిదా వేయించాడు అరవింద్. తెలుగులో సూపర్ హిట్ అయిన భలే భలే మొగాడివోయ్ సినిమా కన్నడలో సుందరంగ జాణ పేరుతో రీమేక్ చేసి రిలీజ్ చేస్తున్నారు. అక్కడ మంచి ఫాలోయింగ్ ఉన్న గణేష్ ఈ సినిమాలో హీరోగా నటించాడు. అయితే ఈ సినిమాను డిసెంబర్ 9న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. కానీ ధృవ రిలీజ్కు సాండల్వుడ్లో థియేటర్ల సమస్య ఎదురవుతుందన్న ఆలోచనతో అరవింద్,ఈ సినిమాను కూడా డిసెంబర్ 23కు వాయిదా వేయించాడట. ప్రముఖ నిర్మాత రాక్లైన్ వెంకటేష్ నిర్మిస్తున్న సుందరంగ జాణకు అల్లు అరవింద్ నిర్మాణ భాగస్వామిగా కూడా వ్యవహరిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement