
ధ్రువ సుర్జా, పూరి జగన్నాథ్
తెలుగులో దర్శకుడిగా కెరీర్ ఆరంభించిన కొత్తలో పూరి జగన్నాథ్ రెండు కన్నడ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఒకటి ‘యువరాజా’ (2001), మరొకటి ‘అప్పు’ (2002). ‘యువరాజా’లో శివరాజ్‌కుమార్ నటించారు. ‘అప్పు’లో ఆయన తమ్ముడు పునీత్ రాజ్‌కుమార్ హీరో. ఆ తర్వాత పదిహేడేళ్లకు ఇషాన్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ‘రోగ్’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు.
ఇప్పుడు ఓ కన్నడ సినిమాకు ప్లాన్ జరుగుతోందని సమాచారం. ధ్రువ సర్జా హీరోగా ఈ సినిమా రూపొందనుందట. ‘పొగరు’లో ‘ఖరాబు మాసు ఖరాబు..’ అంటూ తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నారు ధ్రువ. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ ‘లైగర్’ సినిమా తెరకెక్కిస్తున్నారు. ధ్రువ సర్జా కన్నడంలో ‘దుబారీ’ అనే సినిమా చేస్తున్నారు. మరి... అతని తదుపరి సినిమా పూరీతోనే ఉంటుందా? వేచి చూడాలి.
చదవండి:
కొత్త డైరెక్టర్‌తో మూవీ.. షరతు విధించిన మహేశ్‌బాబు!
ఆ పాత్ర కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్న కాజల్
Comments
Please login to add a commentAdd a comment