లిటిల్‌ తైక్వాండో స్టార్స్‌ | little taekwondo stars | Sakshi
Sakshi News home page

లిటిల్‌ తైక్వాండో స్టార్స్‌

Jun 23 2017 10:36 AM | Updated on Sep 5 2017 2:18 PM

లిటిల్‌ తైక్వాండో స్టార్స్‌

లిటిల్‌ తైక్వాండో స్టార్స్‌

హైదరాబాద్ నగరానికి చెందిన అక్కా తమ్ముళ్లు తైక్వాండోలో సత్తా చాటుతున్నారు.

ఆటలో రాణిస్తోన్న మాన్య, ధ్రువ


హైదరాబాద్: నగరానికి చెందిన అక్కా తమ్ముళ్లు తైక్వాండోలో సత్తా చాటుతున్నారు. భారతీయ విద్యాభవన్‌ పబ్లిక్‌ స్కూల్‌కు చెందిన చిన్నారులు ఎన్‌. మాన్య , ధ్రువ తైక్వాండోలో ఇటీవల వివిధ పోటీల్లో విశేష ప్రతిభ కనబరిచారు. ఇటీవల అంతర్జాతీయ స్థాయిలో జరిగిన ఓపెన్‌ ఇండియన్‌ కప్‌ అండర్‌–12 విభాగంలో ఈ చిన్నారులు పసిడి పతకాలతో సత్తాచాటారు. ఈ టోర్నీలో చెరో రెండు స్వర్ణాలను కైవసం చేసుకున్నారు.

 

చిరుప్రాయం నుంచే క్రీడలపై ఆసక్తి కనబరిచే వీరిద్దరూ గత మూడు సంవత్సరాలుగా పాఠశాలలోనే తైక్వాండో ఈవెంట్‌లో శిక్షణ తీసుకుంటున్నారు. ప్రస్తుతం మాన్య ఆరో తరగతి చదువుతుండగా... ఆమె తమ్ముడు ధ్రువ మూడో తరగతిలో ఉన్నాడు. భవిష్యత్‌లో మరిన్ని పతకాలు సాధించడమే లక్ష్యంగా కోచ్‌ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రతిరోజూ 2గంటల పాటు సాధనలో శ్రమిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తోన్న ఈ చిన్నారులను పాఠశాల యాజమాన్యం కూడా ప్రోత్సహిస్తోంది. క్రీడల్లోనే కాకుండా చ దువుల్లోనూ మంచి ప్రతిభను కనబరుస్తున్నారని స్కూల్‌ ప్రిన్సిపల్‌ రమాదేవి అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement