సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన యువ సెయిలర్ మాన్య రెడ్డికి అరుదైన అవకాశం లభించింది. ఇంటర్నేషనల్ లేజర్ క్లాస్ అసోసియేషన్ 4 (లేజర్ 4.7) యూత్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు ఆమె ఎంపికైంది. జూన్ 22నుంచి 30 వరకు పోర్చుగల్‌లోని వియానా డి కాస్టెలోలో ఈ టోర్నీ జరుగుతుంది. 15 ఏళ్ల మాన్య గత కొంత కాలంగా సెయిలింగ్ పోటీల్లో నిలకడగా రాణిస్తోంది.
హుస్సేన్ సాగర్ జలాల్లో సెయిలింగ్ నేర్చుకున్న ఈ అమ్మాయి తొలి జూనియర్ రెగెట్టాలోనే రజతం సాధించింది. జాతీయ స్థాయిలో జరిగిన పోటీల్లో వరుస విజయాలు సాధించిన ఆమె ఇటీవల షిల్లాంగ్‌లో జరిగిన ర్యాంకింగ్ టోర్నీలో కాంస్యం గెలుచుకుంది. వరల్డ్ చాంపియన్‌షిప్ కోసం భారత్‌నుంచి ఎంపికైన ఇద్దరు సెయిలర్లలో ఒకరిగా మాన్యకు అవకాశం దక్కింది. ఈ టోర్నీ కోసం ప్రస్తుతం మాన్య సిద్ధమవుతోంది.
అయితే వరల్డ్ చాంపియన్íÙప్ స్థాయి టోర్నీలో పాల్గొనడం, ఇతర సన్నాహకాల కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందుకే తన ఈవెంట్ కోసం మాన్య స్పాన్సర్ల సహాయాన్ని ఆశిస్తోంది. ప్రయాణ, వసతి, ఎక్విప్‌మెంట్, శిక్షణ కోసం తనకు అండగా నిలవాలని ఆమె కోరుతోంది. ఈ నేపథ్యంలో మాన్యకు స్పాన్సర్‌షిప్ అందించాలని భావించేవారు ఝ్చ్చny్చట్ఛఛీఛీy20ఃజఝ్చజీ .ఛిౌఝ ద్వారా సంప్రదించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment