అర్జున్‌ మేనల్లుడి పొగరు | Arjun Son in law Dhruv Sarja Movie Soon | Sakshi
Sakshi News home page

అర్జున్‌ మేనల్లుడి పొగరు

Published Wed, Aug 28 2019 7:39 AM | Last Updated on Wed, Aug 28 2019 7:39 AM

Arjun Son in law Dhruv Sarja Movie Soon - Sakshi

రష్మికా మందన్నా , ధృవ సర్జా

యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ మేనల్లుడు ధృవ సర్జా హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పొగరు’. ఇందులో రష్మికా మందన్నా కథానాయికగా నటిస్తున్నారు. నందకిశోర్‌ దర్శకత్వంలో బి.కె. గంగాధర్‌ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో జరుగుతోంది. హీరోకు, అంతర్జాతీయ బాడీ బిల్డర్స్‌కు మధ్య వచ్చే క్లైమాక్స్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ఫ్రెంచ్‌ బాడీ బిల్డర్‌ మోర్గాన్‌ అస్తే, అమెరికన్‌ బాడీ బిల్డర్‌ కై గ్రీనే, జాక్‌ లుకాస్, జో లిన్‌డర్‌ వంటి అంతర్జాతీయ స్థాయి బాడీ బిల్డర్స్‌ నటిస్తున్నారు. ‘భైరవగీత’ ఫేమ్‌ ధనుంజయ్‌ విలన్‌గా నటిస్తున్నారు. సంపత్‌ రాజ్, రవి శంకర్, పవిత్రా లోకేష్‌ కీలక పాత్రధారులు. ‘‘ప్యాన్‌ ఇండియా సినిమాగా పొగరు చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement