
మెగా అభిమానులకు చెర్రీ షాక్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ప్రస్తుతం తనీ ఒరువన్ సినిమాకు రీమేక్గా తెరకెక్కుతున్న ధృవ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఆడియో రిలీజ్...
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ప్రస్తుతం తనీ ఒరువన్ సినిమాకు రీమేక్గా తెరకెక్కుతున్న ధృవ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఆడియో రిలీజ్ ఫంక్షన్ను చేయటం లేదని ప్రకటించాడు చరణ్.లాంచింగ్ ఈవెంట్ లేకుండానే ఈ నెల 9న ధృవ ఆడియోను డైరెక్ట్ గా మార్కెట్ లోకి రిలీజ్ చేయనున్నారు. చెర్రీ ఆడియో వేడుక అంటే మెగా హీరోలందరూ వస్తారని ఫీల్ అయిన అభిమానులకు ఇది షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.
ప్రస్తుతం ధృవ పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు ఖైదీ నంబర్ 150 ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న చెర్రీ ఆడియో వేడుకను నిర్వహించకుండా.. సినిమా రిలీజ్కు ముందు ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ ఫంక్షన్ను విజయవాడ వేదికగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తున్న ధృవ డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.