'ధృవ' టీమ్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్.. | No delay in Dhruva's release date | Sakshi
Sakshi News home page

'ధృవ' టీమ్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్..

Published Wed, Aug 24 2016 4:47 PM | Last Updated on Mon, Jul 29 2019 6:03 PM

'ధృవ' టీమ్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్.. - Sakshi

'ధృవ' టీమ్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజా చిత్రం 'ధృవ' విడుదలపై వస్తున్న రూమర్లకు చెక్ పెడుతూ చిత్ర టీం బుధవారం అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేసింది. దసరా కానుకగా 'ధృవ' ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్ర యూనిట్ ముందే తెలిపింది. అయితే 'ధృవ' రిలీజ్ వాయిదా పడిందని, దసరా బరి నుంచి తప్పుకుందని.. దీపావళికి విడుదల చేయనున్నారంటూ గత రెండు రోజులుగా అసత్య ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పుకార్లను నమ్మొద్దంటూ చిత్ర నిర్మాత స్పందించారు.

ముందుగా చెప్పినట్టే 'ధృవ' సినిమా అక్టోబర్ 7 వ తేదీన విడుదల అవుతుందని, దసరా సీజన్లో సందడి చేయనుందని టీమ్ స్పష్టం చేసింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా పూర్తవుతోందని తెలిపింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తున్నారు. తమిళ్లో సూపర్ హిట్ అయిన 'తని ఒరువన్' కు రీమేక్ గా ఈ చిత్రం నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement