రామ్చరణ్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశాడు | Release date confirmed for Ram charan Dhruva | Sakshi
Sakshi News home page

రామ్చరణ్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశాడు

Published Sun, Oct 16 2016 1:42 PM | Last Updated on Tue, Jul 23 2019 11:50 AM

రామ్చరణ్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశాడు - Sakshi

రామ్చరణ్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశాడు

బ్రూస్లీ సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న మెగా పవర్ స్టార్ రామ్చరణ్, ధృవ సినిమాతో ఆడియన్స్ ముందుకు రానున్న సంగతి తెలిసిందే. తమిళ సూపర్ హిట్ సినిమా తనీ ఒరువన్కు రీమేక్గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా దర్శకుడు సురేందర్ రెడ్డి స్టైలిష్ ఎంటర్టైనర్గా ధృవ సినిమాను రూపొందిస్తున్నారు.

ముందుగా ఈ సినిమాను దసరాకే రిలీజ్ చేయాలని భావించినా.. చరణ్, చిరంజీవి 150వ సినిమా నిర్మాణ పనుల్లో బిజీగా ఉండటం, మధ్యలో విలన్గానటిస్తున్న అరవింద్ స్వామి ఆరోగ్యం బాలేకపోవటంతో ఆలస్యమైంది. దీంతో రెండు నెలలు ఆలస్యంగా సినిమాను రిలీజ్ చేస్తామని ప్రకటించిన చిత్రయూనిట్ ఫైనల్గా సినిమా రిలీజ్ డేట్పై ఓ అభిప్రాయానికి వచ్చారన్న టాక్ వినిపిస్తోంది.

అన్నికార్యక్రమాలు పూర్తి చేసి డిసెంబర్ 2న ధృవ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు. చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్పై భారీగా నిర్మిస్తున్నారు. రామ్చరణ్ కూడా డిఫరెంట్ మేకోవర్లో ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement