
నా శత్రువే బలం!
యుద్ధంలో విజయం సాధించాలంటే మన బలాన్నంతటినీ కూడదీసుకోవాలి. శత్రువుల ఊహకు అందకుండా యుద్ధం చేయాలంటే ప్రతి అడుగు చాలా తెలివిగా వేయాలి.
యుద్ధంలో విజయం సాధించాలంటే మన బలాన్నంతటినీ కూడదీసుకోవాలి. శత్రువుల ఊహకు అందకుండా యుద్ధం చేయాలంటే ప్రతి అడుగు చాలా తెలివిగా వేయాలి. శత్రువుకి దూరంగా పారిపోకుండా అతనే మన బలం అనుకుంటే? యుద్ధం మజాగా ఉంటుంది. ‘ధృవ’ చిత్రంలో శత్రువుతో రామ్‌చరణ్ చేయనున్న పోరాటం అలాంటిదే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్‌చరణ్, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా రూపొందుతున్న ఈ చిత్రానికి ‘మై ఎనిమీ ఈజ్ మై స్ట్రెంగ్త్’ (నా శత్రువే నా బలం)... అనేది ఉపశీర్షిక. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్, ఎన్వీ ప్రసాద్‌లు నిర్మిస్తున్నారు. సోమవారం ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
‘ధృవ’ టైటిల్ లోగోలో ‘8’ అంకెను పొందుపరిచారు. దాంతో కథలో ‘8’కి ఏదైనా ప్రాముఖ్యం ఉందా? అనే దిశగా చర్చ జరిగింది. అన్నట్లు.. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న 8వ చిత్రమిది. ఒకవేళ ఆ విషయాన్నే ఈ విధంగా సూచించారా? అనేది తెలియాల్సి ఉంది. రామ్ చరణ్ ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్‌గా నటిస్తున్న ఈ సినిమా తమిళ ‘తని ఒరువన్’కి రీమేక్ అనే సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి కెమేరా: అసీమ్ మిశ్రా, సంగీతం: హిప్ హాప్ ఆది, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వై.వి. ప్రవీణ్‌కుమార్.