మెగా పవర్ స్టార్ రాంచరణ్ తాజా సినిమా 'ధృవ'. గతవారం విడుదలైన ఈ సినిమాకు..
మెగా పవర్ స్టార్ రాంచరణ్ తాజా సినిమా 'ధృవ'. గతవారం విడుదలైన ఈ సినిమాకు మంచి టాక్, సానుకూల రివ్యూలు వచ్చినా.. అనుకున్నంతగా వసూళ్లు మాత్రం సాధించలేదని వినిపిస్తోంది. 'ధృవ' వసూళ్లలో దూసుకుపోకపోవడానికి ప్రధాన కారణాల్లో నోట్లరద్దు ఒకటని చెప్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున విడుదలైన 'ధృవ' సినిమా తొలి మూడు రోజుల్లో దాదాపు 20 కోట్లు మాత్రమే వసూలు చేసిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా 50 కోట్ల క్లబ్బులో చేరుతుందా అంటే పరిశీలకులు ఏమీ చెప్పలేకపోతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఇలా.. ఓవర్సీస్ మార్కెట్‌లో మాత్రం ఈ సినిమా దుమ్మురేపుతోంది. తొలిసారిగా విదేశాల్లో మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించిన రాంచరణ్ సినిమాగా నిలిచింది. అయితే, రానున్న రెండువారాల్లో పెద్ద సినిమాల విడుదల లేకపోవడం 'ధృవ'కు అడ్వాంటేజ్ అని పరిశీలకులు అంటున్నారు. ఈ రెండువారాల్లో వసూళ్లు పుంజుకుంటే.. ఈ చిత్రం 50 కోట్ల క్లబ్బులో చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. స్టైలిష్ దర్శకుడు సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రాంచరణ్, రకుల్‌ప్రీత్, అరవిందస్వామి ప్రధాన పాత్రల్లో భారీ బడ్జెట్‌తో 'ధృవ' తెరకెక్కింది.