ధృవలో విలన్గా నేను చేయాల్సింది: సీనియర్ హీరో | Rajasekhar Reveals Shocking Fact About Dhruva | Sakshi
Sakshi News home page

ధృవలో విలన్గా నేను చేయాల్సింది: సీనియర్ హీరో

Published Tue, Jul 11 2017 11:30 AM | Last Updated on Tue, Sep 5 2017 3:47 PM

ధృవలో విలన్గా నేను చేయాల్సింది: సీనియర్ హీరో

ధృవలో విలన్గా నేను చేయాల్సింది: సీనియర్ హీరో

కొంత కాలంగా తన స్థాయికి తగ్గ సక్సెస్లు అంధించటంలో ఫెయిల్ అవుతున్న యాంగ్రీ హీరో రాజశేఖర్, త్వరలో గరుడవేగ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ఇప్పటికే మొదలు పెట్టేశారు. అందులో భాగంగా తరువాత మీడియా ఇంటర్య్వూలతో సందడి చేస్తున్నాడు రాజశేఖర్.

ఇటీవల ఓ ఇంటర్య్వూలో భాగంగా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. రామ్ చరణ్ హీరోగా తమిళ సూపర్ హిట్ సినిమా తనీఒరువన్కు రీమేక్గా తెరకెక్కిన సినిమా ధృవ. ఈ సినిమాలో విలన్ పాత్రకు ముందుగా రాజశేఖర్నే తీసుకోవాలని భావించారట. అంతా ఓకే అనుకున్న సమయంలో నిర్మాత అరవింద్ స్వామితోనే ఆ పాత్ర చేయిచేందుకు నిర్ణయించామని తెలిపాడట. తమిళంలో అరవింద్ స్వామి కనిపించిన సోలో సీన్స్ను రీ షూట్ చేసే అవసరం ఉండదన్న కారణంగా ఆ నిర్ణయం తీసుకున్నారని నిర్మాత తెలిపారన్నాడు రాజశేఖర్.

అంతేకాదు త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న బాలకృష్ణ 102 సినిమా కోసం విలన్గా రాజశేఖర్ను సంప్రదించారట. అయితే అది రొటీన్ విలన్ పాత్రే కావటంతో సున్నితంగా తిరస్కరించానని తెలిపాడు. తేజతో తాను చేయాల్సిన సినిమా ఆగిపోవటంపై కూడా రాజశేఖర్ స్పందించాడు. కేవలం క్లైమాక్స్ విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవటం వల్లే ఆ ప్రాజెక్ట్ పక్కన పెట్టేశామని, మంచి కథ వస్తే విలన్గా నటించడానికి తనకు అభ్యంతరం లేదని తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement