ధృవ తరువాత బ్రేక్ | Ram Charans Next To Start In November | Sakshi
Sakshi News home page

ధృవ తరువాత బ్రేక్

Published Fri, Aug 19 2016 10:32 AM | Last Updated on Mon, Sep 4 2017 9:58 AM

ధృవ తరువాత బ్రేక్

ధృవ తరువాత బ్రేక్

ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ధృవ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు రామ్ చరణ్. తమిళ బ్లాక్ బస్టర్ తనీఒరువన్కు రీమేక్గా రూపొందుతున్న ఈ సినిమా కోసం చెర్రీ చాలా కష్టపడుతున్నాడు. ముఖ్యంగా ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ లుక్లో కనిపించటం కోసం భారీ కసరత్తులే చేశాడు. హెయిర్ స్టైల్, కాస్ట్యూమ్స్ ఇలా ప్రతీ విషయంలో కేర్ తీసుకొని పనిచేస్తున్నాడు.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసి దసరగా కానుకగా ధృవ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా తరువాత ఎలాంటి గ్యాప్ తీసుకోకుండా అక్టోబర్ ఫస్ట్ నుంచే చరణ్ తన తరువాతి సినిమాను స్టార్ చేస్తాడన్న టాక్ వినిపించింది. అయితే సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాను నెల ఆలస్యంగా నవంబర్లో ప్రారంభించేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు చరణ్.

ధృవ సినిమాలో పోలీస్ ఆఫీసర్ లుక్ కోసం కండలు పెంచి రఫ్ లుక్లో కనిపిస్తున్నాడు చెర్రీ. అయితే సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోయేది పూర్తి ప్రేమ కథ కావటంతో లవర్ బాయ్ లుక్ కోసం బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడట. ఈ గ్యాప్ను హెయిర్ స్టైల్, ఫిజిక్ విషయంలో మేకోవర్ కోసం కేటాయించాడు. చరణ్నుపూర్తి స్థాయి ప్రేమికుడిగా చూపిస్తున్న సుకుమార్, తన మార్క్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ను కూడా ఈ సినిమాకు జోడిస్తున్నాడట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement