చరణ్ ఫ్యాన్స్కు గుడ్న్యూస్
బ్రూస్ లీ సినిమాతో నిరాశపరిచిన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తన నెక్ట్స్ సినిమా ధృవ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందుకే దసరా బరిలో రిలీజ్ కావల్సిన సినిమాను రెండు నెలల పాటు వాయిదా వేసి డిసెంబర్ రిలీజ్కు ప్లాన్ చేశాడు. అయితే దసరాకు సినిమా వస్తుందన్న ఆశతో ఉన్న అభిమానులకు కాస్త ఊరట కల్గించేందుకు పండుగ కానుకను సిద్ధం చేస్తున్నాడు చెర్రీ.
ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్తో అలరించిన చరణ్, దసరా కానుకగా టీజర్ను రిలీజ్ చేయనున్నాడుట. ఇప్పటికే ఈ టీజర్ కోసం సంగీత దర్శకుడు హిప్ హాప్ తమీజా థీమ్ మ్యూజిక్ కూడా రెడీ చేశాడన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఈ టీజర్లో చరణ్ డైలాగ్ ఉండాలా..? లేదా..? అన్న విషయంలో దర్శకుడు సురేందర్ రెడ్డి ఆలోచనలో పడ్డాడట. ఏది ఏమైనా దసరాకు మెగా అభిమానుల కోసం ధృవ టీజర్ ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు చరణ్.