
తొలిసారి చార్మినార్ ఎక్కిన చరణ్
గతంలో ఎన్నడూ లేని విధంగా యంగ్ హీరో రామ్ చరణ్ తన కొత్త సినిమా ధృవ విశేషాలను అభిమానులతో పంచుకుంటున్నాడు. షూటింగ్ అప్డేట్స్ అందించటంతో పాటు లోకేషన్లో దిగిన సెల్ఫీ ఫోటోలను సోషల్ మీడియాలో...
గతంలో ఎన్నడూ లేని విధంగా యంగ్ హీరో రామ్ చరణ్ తన కొత్త సినిమా ధృవ విశేషాలను అభిమానులతో పంచుకుంటున్నాడు. షూటింగ్ అప్డేట్స్ అందించటంతో పాటు లోకేషన్లో దిగిన సెల్ఫీ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చేస్తూ సినిమా మీద అంచనాలు పెంచేస్తున్నాడు. తాజాగా చెర్రీ పోస్ట్ చేసిన ఓ వీడియో మెగా అభిమానులకు కిక్ ఇస్తోంది.
ప్రస్తుతం చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ధృవ షూటింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా తొలిసారిగా చార్మినార్ ఎక్కిన చరణ్.. తను చార్మినార్ ఎక్కుతున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతేకాదు తొలిసారిగా చార్మినార్ పైకి ఎక్కడం ఎంతో ఆనందంగా ఉందని.. అక్కడి నుంచి ఓల్డ్ సిటీ ఎంతో అందంగా కనిపిస్తుందంటూ కామెంట్ చేశాడు.