Kerosene Movie Streaming On Aha OTT Platform - Sakshi
Sakshi News home page

Kerosene: ఆహాలో ఆకట్టుకుంటున్న సస్పెన్స్ థ్రిల్లర్ 'కిరోసిన్'..!

Published Sun, Sep 18 2022 8:07 PM | Last Updated on Mon, Sep 19 2022 9:52 AM

Kerosene Movie Streaming in in OTT Platform Aha - Sakshi

సస్పెన్స్ థ్రిల్లింగ్ అంశాలతో తెరకెక్కిన చిత్రం 'కిరోసిన్'. ధృవ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ఈ సినిమాను బిగ్ హిట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మించారు. ఇటీవల థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఆహా'లో విడుదలైంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. బిగ్ స్క్రీన్‌పై హిట్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ఓటీటీలోనూ దూసుకెళ్తోంది.

(చదవండి: ‘కిరోసిన్‌’ మూవీ రివ్యూ)

 కథ, కథనాల విషయంలో ఎన్నో జాగ్రత్తలు వహించి ఈ సినిమా చేయగా అవి ప్రేక్షకుల్లో ఎంతో ఉత్కంఠను రేకెత్తించాయి . అంతే కాదు స్క్రీన్ ప్లే బాగుందన్న ప్రశంసలు కూడా అందుకుంది ఈ చిత్రం.  ఫ్యామిలీ ఆడియెన్స్‌ను సైతం ఈ మూవీ  ఆకట్టుకోవడం విశేషం.  ఇటీవల కాలంలో ఓటీటీలో కొన్ని చిన్న సినిమాలైనా ప్రేక్షకులను ఎంతో విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రేక్షకుల అభిరుచి మారిన నేపథ్యంలో చిన్న సినిమాల కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస‍్తున్నారు. సస్పెన్స్ అండ్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం జూన్‌ 17 థియేటర్లలో విడుదలైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement