
సురేందర్ రెడ్డితో జాగ్వర్..?
జాగ్వర్ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన యంగ్ హీరో నిఖిల్ గౌడ. తొలి సినిమాతో భారీ బడ్జెట్ తో తెరకెక్కించటంతో నిఖిల్ పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అయితే ఆ అంచనాలను అందుకోవటం జాగ్వర్ విఫలమైంది. అయితే తొలి సినిమా రిజల్ట్ తో సంబందం లేకుండా నిఖిల్ రెండో సినిమాను కూడా భారీగా ప్లాన్ చేస్తున్నారు.
జాగ్వర్ ఆడియో రిలీజ్ లో చెప్పినట్టుగా ఓ తెలుగు దర్శకుడితో నిఖిల్ రెండో సినిమా ఉండబోతుందన్న వార్త ఇప్పడు హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా ధృవ సినిమాను తెరకెక్కిస్తున్న సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నిఖిల్ తన రెండో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడట. స్టైలిష్ ఎంటర్టైనర్ లు రూపొందించటంతో స్పెషలిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న సురేందర్ రెడ్డి నిఖిల్ కు సక్సెస్ ఇస్తాడేమో చూడాలి.