ఆ హీరోను అడ్డంగా బుక్ చేసేసింది! | hansika comments on biryani | Sakshi
Sakshi News home page

ఆ హీరోను అడ్డంగా బుక్ చేసేసింది!

Published Thu, Dec 19 2013 12:38 AM | Last Updated on Sat, Sep 2 2017 1:45 AM

హన్సిక

హన్సిక

హన్సిక ఓ హీరోను నిలువునా బుక్ చేసేసింది. ఆ హీరోగారు ఓ అమ్మాయితో బాత్రూమ్‌లో రొమాన్స్ చేస్తుంటే.. ఆ గదికి తాళం వేసి మరీ ఆ హీరోను పట్టించేసింది.  హన్సిక పుణ్యమా అని బుక్కయిపోయిన ఆ హీరో ఎవరనుకుంటున్నారా? తానెవరో కాదు... కార్తీ. బయట డీసెంట్ గాయ్‌గా పేరు పొందిన కార్తీ... ఇటీవలే ఓ ప్రైవేట్ హౌస్ బాత్రూమ్‌లో ఓ అమ్మాయితో రొమాన్స్ చేస్తూ హన్సిక కంట పడ్డాడు. దాంతో హన్సిక ఆ బాత్రూమ్‌కి లాక్ వేసి, కార్తీని పట్టించింది. ఆ సిట్యుయేషన్‌లో కార్తీని అందరూ చూసేశారట. చివరకు వాళ్ల ఆవిడతో సహా.
పాపం కొత్తగా పెళ్లయిన కార్తీకి ఇంతకు మించిన కష్టం వేరే ఉండదేమో! భర్తను ఆ స్థితిలో చూసి కార్తీ భార్య ఎలా ఫీలైంది? అనేగా మీ ప్రశ్న. పగలబడి నవ్వేసిందట. అదేంటి? అనుకుంటున్నారా! ‘బిరియాని’ సినిమాలో ఓ ఫన్నీ సీన్ ఇది. ఇందులో కార్తీ ప్లేబోయ్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలోకెల్లా తనకు అమితంగా ఇష్టమైన సీన్ ఇదేనని చెబుతున్నారు హన్సిక. ఇటీవలే ‘బిరియాని’ చిత్రాన్ని కార్తీ కుటుంబ సభ్యులతో కలిసి హన్సిక కూడా వీక్షించారు. ఈ సందర్భంగా ఆమె పై విధంగా స్పందించారు. ఈ సీన్‌లో కార్తీ ఎక్స్‌ప్రెషన్స్ చూసి నవ్వుని ఆపుకోలేకపోయానని, ప్రేక్షకులు కూడా ఈ సీన్‌ని విపరీతంగా ఎంజాయ్ చేస్తారని హన్సిక నమ్మకం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement