
అమితాబ్ , షారుక్ ఖాన్
....అయితే ఆయన తప్పుకుంటున్నది సినిమాల నుంచి కాదు.. ట్విట్టర్ ఖాతా నుంచి! యంగ్ హీరోలకంటే కూడా ఎప్పుడూ ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉండే బిగ్ బీ హఠాత్తుగా ఎందుకు తప్పుకుంటున్నారు? అనే ప్రశ్న రాక మానదు. ట్విట్టర్‌లో తన ఫాలోయర్ల సంఖ్య తగ్గిందని అభిప్రాయపడ్డ అమితాబ్ బుధవారం చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. ‘‘ట్విటర్... (ట్విట్టర్‌ని ఉద్దేశించి) నువ్వు నా ఫాలోయర్ల సంఖ్యను తగ్గించేశావు. ఇది జోక్‌గా ఉంది. ఇక నీ నుంచి బయటకు రావాల్సిన టైమ్ వచ్చింది. బయట ఇంకా చెప్పాల్సినవి, ఆసక్తికరమైన అంశాలు చాలా ఉన్నాయి.
థ్యాంక్యూ’’ అంటూ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు ట్విట్టర్‌లో అత్యధిక ఫాలోయర్లు ఉన్న సెలబ్రిటీ బిగ్ బీనే. ఆయన ఫాలోయర్ల సంఖ్య 32,902,353. తాజాగా బిగ్ బీని షారుక్ ఖాన్ దాటేశారు. షారుక్ ట్విట్టర్ ఫాలోయర్ల సంఖ్య 32,944,338. షారుక్ ఫస్ట్ ప్లేస్‌కి రావడంవల్లే బిగ్ బి ఏకంగా ట్విట్టర్ నుంచి తప్పుకోవాలని డిసైడ్ అయ్యారని బాలీవుడ్ టాక్.