Woman kisses Shah Rukh Khan at Dubai event - Sakshi
Sakshi News home page

Shah Rukh Khan: పర్మిషన్ లేకుండా షారుక్‌కి ముద్దుపెట్టిన లేడీ!

Published Wed, Jun 14 2023 1:16 PM | Last Updated on Wed, Jun 14 2023 1:26 PM

Woman Kiss Shah Rukh Khan In Dubai Event - Sakshi

మీ ఫేవరెట్ హీరో లేదా హీరోయిన్ కనిపిస్తే ఏం చేస్తారు? మహా అయితే సెల్ఫీ దిగుతారు. కుదరకపోతే దురం నుంచే ఫొటో తీసుకుని సంతోషపడతారు. కానీ ఓ మహిళా అభిమాని మాత‍్రం అంతకు మించి అనేలా ప్రవర్తించింది. దీంతో బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కు చేదు అనుభవం ఎదురైంది. ఇంతకీ ఎప్పుడు ఏం జరిగిందో తెలుసా?

హిందీలో ఇప్పుడు చాలామంది హీరోలున్నారు. కానీ 90స్ జనరేషన్ నుంచి ఇప్పటివరకు అందరినీ కవర్ చేసిన హీరో అంటే మాత్రం షారుక్ ఖాన్ గుర్తొస్తాడు. ఎన్నో అద్భుతమైన చిత్రాలతో హిట్స్ కొట్టిన షారుక్.. గత కొన్నేళ్లుగా వరసగా ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్నాడు. ఈ ఏడాది మాత్రం 'పఠాన్' తో వేరే లెవల్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. ప‍్రస్తుతం రెండు కొత్త మూవీస్ చేస్తూ బిజీ.

ఈ మధ్య సోషల్ మీడియాలోనూ యాక్టివ్ అయిన షారుక్.. రీసెంట్ గా దుబాయిలోని ఓ ప్రైవేట్ ఈవెంట్ లో పాల్గొన్నాడు. ఇందులో భాగంగా ఈవెంట్ కి సంబంధించిన వాళ్లతో పాటు  కొందరు ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అందులో ఒకామె షారుక్ ని చూసి ఆత్రం ఆపుకోలేకపోయింది. పర్మిషన్ లేకుండానే అతడి బుగ్గపై గట్టిగా ముద్దు పెట్టేసింది. తెగ ఆనందపడిపోయింది. కొందరు నెటిజన్స్ ఇదంతా చూసి.. అనుమతి లేకుండా ఇలా చేసినందుకు ఆమెని జైల్లో వేయమని కామెంట్స్ పెడుతున్నారు.

(ఇదీ చదవండి: షారుక్‌ ఖాన్ ఇంటికి ఫ్రీ ఫుడ్.. ఇది యాపారం!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement