
న్యూఢిల్లీ : అదేంటి షారుఖ్ ఖాన్ వయస్సు 53 సంవత్సరాలయితే 27సంవత్సరాలు అని చెబుతున్నారని తికమక పడుతున్నారు. అదేనండీ షారుఖ్‌ఖాన్ బాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చి నేటికి సరిగ్గా 27 ఏళ్లు. నటుడిగా 27 వసంతాలు పూర్తి చేసుకున్న ఈ బాలీవుడ్ బాద్ షా.. ఎన్నో మరుపురాని సూపర్‌హిట్ చిత్రాలతో తన అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. తన విశిష్టమైన నటనతో దాదాపు మూడు దశాబ్దాలుగా అలరిస్తున్న ఫారుఖ్‌ను ఈ సందర్భంగా అభినందిస్తూ.. అభిమానుల నుంచి పెద్ద ఎత్తున ట్వీట్ల వర్షం కురిసింది.
సరిగ్గా ఇదే రోజున (జూన్ 25, 1992లో) 'దీవానా' సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమైన షారుఖ్‌ఖాన్ తన మొదటి సినిమాతోనే 'ఉత్తమ మేల్ డెబ్యూ' అవార్డును గెలుచుకున్నాడు. ఈ సినిమాలో రిషికపూర్, దివ్యభారతి లీడ్ రోల్స్‌లో నటించగా, షారుఖ్‌ఖాన్ రెండో కథానాయకుడి పాత్రను పోషించాడు. మంచి హిట్‌గా నిలిచిన దీవానా షారుఖ్ కెరీర్‌లో కీలకంగా నిలిచింది. షారుఖ్ 'దిల్ ఆప్నా హై' సినిమాను మొదట సైన్ చేసినా 'దీవానా ' సినిమా ముందు రిలీజైంది. గతేడాది 'జీరో' సినిమాతో ముందుకు వచ్చిన షారుఖ్‌ఖాన్‌కు చేదు అనుభవాన్నే మిగిల్చింది. కత్రినా కైఫ్, అనుష్కశర్మ కథానాయికలుగా నటించిన ఈ సినిమా భారీ పరాజయాన్ని చవిచూసింది. ఇంతకాలం తన నటనతో ఆకట్టుకొన్న బాలీవుడ్ బాద్‌షా మరిన్ని మంచి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment