
ఐపీఎల్-2024లో భాగంగా ఈడెన్‌గార్డెన్స్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ యాజమాని, బాలీవుడ్ బాదుషా షారుఖాన్ సందడి చేశాడు. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు కింగ్ ఖాన్ ఈడెన్ గార్డెన్స్ స్టేడియంకు వచ్చాడు.
స్టాండ్స్‌లో కూర్చుని మ్యాచ్‌ను షారుఖ్ ఎంజాయ్ చేశాడు. ఆటగాళ్లు బౌండరీలు బాదిన ప్రతీసారి షారుఖ్ ఖాన్ చప్పట్లు కొడుతూ ఉత్సాహపరిచాడు. షారుఖ్‌తో పాటు అతని కుమార్తె సుహానా ఖాన్, బాలీవుడ్ హీరోయిన్ బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే సైతం కేకేఆర్‌ను సపోర్ట్ చేసేందుకు వచ్చారు.
ముఖ్యంగా లక్నో కీలక ఆటగాడు ఆయూష్ బదోని ఔటయ్యాక షారుఖ్,సుహానా,అనన్య సంబరాల్లో మునిగితేలిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లలో నికోలస్ పూరన్ 45 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కేఎల్ రాహుల్ 39 పరుగులతో రాణించాడు.
— Sitaraman (@Sitaraman112971) April 14, 2024
Comments
Please login to add a commentAdd a comment