
గతంలో భోజపూరీ పాట లాలీపాప్ లాగేలు, తెలుగులో అల్లుఅర్జున్ బుట్టబొమ్మ పాటకు స్టెప్పులు వేసి అదరగొట్టిన అమెరికన్ జంట మళ్లీ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తుంది. తాజాగా బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ నటించిన రావన్ సినిమాలోని చమ్మక్ చల్లో పాటకి డ్యాన్స్ చేసి ఈ జంట నెటజన్లను ఫిదా చేస్తోంది. 25 వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా రీకీపాండ్ తన భార్యతో కలిసి చమ్మక్ చల్లో పాటకు స్టెప్పులు వేశాడు.
కాగా సోషల్ మీడియాలో "డ్యాన్సింగ్ డాడ్" అని పిలువబడే రికీ పాండ్, అతని భార్య భారతీయ సాంప్రదాయ దుస్తులు ధరించారు. రికీ పాండ్ పైజామా ధరించగా.. అతని భార్య కుర్తా, గాగ్రా ధరించారు. ఈ వీడియోని ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసి చమ్మక్ చల్లో.. 25వ పెళ్లి రోజు శుభాకాంక్షలు అంటూ క్యాప్షన్ ఇచ్చారు. కాగా.. ఇప్పుడు ఈ వీడియో వైరల్ తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో పై నెటజెన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment