
స్నేహం కోసం... షారూఖ్
బాలీవుడ్ బాద్ షా షారూఖ్, త్వరలో రిలీజ్కు రెడీ అవుతున్న ఓ సినిమాకు వాయిస్ ఓవర్ అందించాడు. సౌత్ నార్త్ ఇండస్ట్రీలకు సుపరిచితుడైన యాక్షన్ స్టార్ సోనూసూద్ తొలిసారిగా నిర్మాతగా మారి తెరకెక్కిస్తున్న...
బాలీవుడ్ బాద్ షా షారూఖ్, త్వరలో రిలీజ్కు రెడీ అవుతున్న ఓ సినిమాకు వాయిస్ ఓవర్ అందించాడు. సౌత్ నార్త్ ఇండస్ట్రీలకు సుపరిచితుడైన యాక్షన్ స్టార్ సోనూసూద్ తొలిసారిగా నిర్మాతగా మారి తెరకెక్కిస్తున్న టుటక్ టుటక్ టుటియా సినిమా ప్రమోషన్ కోసం రూపొందించిన ట్రైలర్కు షారూక్ గాత్రదానం చేశాడు. తనతో కలిసి హ్యాపీ న్యూయిర్ సినిమాలో నటించిన సోనూతో ఉన్న స్నేహం కారణంగానే షారూక్, వాయిస్ నేరేషన్కు అంగీకరించాడు.
హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందుతున్న ఈ సినిమా బాలీవుడ్ వర్షన్ సోనూసూద్ నిర్మిస్తుండగా, తమిళ వర్షన్ను ప్రభుదేవా, తెలుగు వర్షన్ను కోనా వెంకట్లు నిర్మిస్తున్నారు. సోనూసూద్, ప్రభుదేవా, తమన్నాలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను అక్టోబర్ 7న రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు.
Thank u so much @iamsrk for being a part of my first journey as a producer. Really means a lot. 👑https://t.co/994ZwueJqt
— sonu sood (@SonuSood) 10 September 2016