
బాలీవుడ్‌లో అక్షయ్‌కుమార్ మంచి స్పీడ్ మీద సినిమాలు చేస్తుంటారు. ఏడాదికి కనీసం నాలుగు సినిమాలనైనా ఆయన థియేటర్స్‌లో వేస్తారు. ఈ ఏడాది కూడా అక్షయ్ నటిస్తున్న ఐదు సినిమాలు రిలీజ్‌కు రెడీ కానున్నాయి. కానీ షారుక్‌ఖాన్ లాంటి స్టార్స్ కొందరు ఏడాదికి ఒక్క సినిమానే చేస్తుంటారు. అక్షయ్‌లా మీరు ఏడాదికి నాలుగైదు సినిమాలు చేయవచ్చు కదా? అన్న ప్రశ్నను షారుక్ ముందు ఉంచితే... ‘‘నేను అక్షయ్‌లా ఉదయాన్నే నిద్ర లేవలేను. అక్షయ్ నిద్రలేచే సమయానికి నేను సెట్‌లో ప్యాకప్ చెబుతాను. ఆయన సెట్‌కి బయలుదేరే టైమ్‌కి నేను నిద్రపోతా. మేం ఇద్దరం కలిసి ఓ మల్టీస్టారర్ మూవీ చేయాలన్నా కూడా టైమ్ కుదరదేమో’’ అని సరదాగా చెప్పారు.