
బౌండరీ లైన్ వద్ద షారుఖ్ క్యాచ్
చెన్నై : షారుఖ్ ఖాన్.. స్టన్నింగ్ క్యాచ్ ఏంటీ? అనుకుంటున్నారా? అయితే ఇది మీరనుకునే బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కాదు. తమిళనాడు క్రికెటర్ మసూద్ షారుఖ్ ఖాన్. తమిళనాడు ప్రీమియర్ లీగ్ (టీఎన్‌పీఎల్)లో భాగంగా లైకా కోవా కింగ్స్(ఎల్‌కేకే), ఐడ్రీమ్ కరైకుడి కలై(ఐకేకే) జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ తమిళ షారుఖ్ ఖాన్ అద్బుత క్యాచ్‌తో అదరగొట్టాడు. ఈ డొమెస్టిక్ లీగ్‌లో ఎల్‌కేకు ప్రాతినిథ్యం వహిస్తున్న షారుఖ్ ఖాన్.. బౌండరీ లైన వద్ద ఐకేకే జట్టు బ్యాట్స్‌మన్ రాజమణి శ్రీనివాసన్ ఆడిన భారీ షాట్‌ను అడ్డుకోవడమే కాకుండా అద్బుత క్యాచ్‌తో పెవిలియన్ చేర్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఈ షారుఖ్ ఫీట్‌కు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డీన్ జోన్స్ కూడా ఫిదా అయ్యాడు. దీంతో ఈ తమిళ షారుఖ్ ఒక్కసారి హీరో అయిపోయాడు.
👏🏻👏🏻👏🏻👏🏻👏🏻 oh my!!! https://t.co/dMkhutd7sa
— Dean Jones (@ProfDeano) July 16, 2018
ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐకేకే 7 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. ఎల్‌కేకే కూడా నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 162 పరుగులే చేసింది. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment