షారుక్‌ ఖాన్‌.. పంజాబ్‌ కింగ్స్‌కు దొరికిన వరం | IPL 2023: Fans Praise PBKS Shahrukh Khan Smart Play Vs LSG Viral | Sakshi
Sakshi News home page

#Shahrukh Khan: షారుక్‌ ఖాన్‌.. పంజాబ్‌ కింగ్స్‌కు దొరికిన వరం

Published Sun, Apr 16 2023 12:18 AM | Last Updated on Sun, Apr 16 2023 12:23 AM

IPL 2023: Fans Praise PBKS Shahrukh Khan Smart Play Vs LSG Viral  - Sakshi

Photo: IPL Twitter

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్‌ దూసుకెళుతుతంది. శనివారం లక్నో సూపర్‌ జెయింట్స్‌తో మ్యాచ్‌లో ఆద్యంతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సికందర్‌ రజా హాఫ్‌ సెంచరీతో రాణించి విజయంలో కీలకపాత్ర పోషించాడు.

అయితే ఆఖర్లో సికందర్‌ రజా ఔటవ్వడంతో కాస్త ఉత్కంఠ నెలకొన్నప్పటికి షారుక్‌ ఖాన్‌ తన సూపర్‌స్మార్ట్‌ ఇన్నింగ్స్‌తో పంజాబ్‌ను విజయతీరాలకు చేర్చాడు. షారుక్‌ ఖాన్‌ చేసింది 23 పరుగులే కావొచ్చు.. కానీ ఒత్తిడిలో అతను పంజాబ్‌ను గెలిపించిన విధానం సూపర్‌ అని చెప్పొచ్చు.

అంతకముందు లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఇన్నింగ్స్‌ సమయంలో షారుక్‌ ఖాన్‌ రెండు స్ట​న్నింగ్‌ క్యాచ్‌లతో మెరిశాడు. బౌండరీ లైన్‌ వద్ద కష్టసాధ్యంగా అనిపించిన క్యాచ్‌లను బౌండరీ లైన్‌ తొక్కకముందే బంతిని గాల్లోకి ఎగరేసి బ్యాలెన్స్‌ చేసుకొని మళ్లీ బౌండరీ లైన్‌ ఇవతలు వచ్చి స్మార్ట్‌గా క్యాచ్‌లు తీసుకున్నాడు. ఇక్కడ విశేషమేమిటంటే దాదాపు రెండు క్యాచ్‌లను ఒకేలా తీసుకున్న షారుక్‌ ఖాన్‌ స్మార్ట్‌నెస్‌ ఉపయోగించాడు.

అలా ఇవాళ్టి మ్యాచ్‌లో సికందర్‌ రజాతో పాటు షారుక్‌ ఖాన్‌ కూడా హీరో అయ్యాడు. షారుక్‌ ఖాన్‌పై సోషల్‌ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ''నిజంగా షారుక్‌ ఖాన్‌ పంజాబ్‌ కింగ్స్‌కు దొరికిన ఒక వరం.. అతన్ని ఉపయోగించుకుంటే తెలివిగా మ్యాచ్‌లను గెలవొచ్చు'' అంటూ కామెంట్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement