
సైనికులపై షారూక్ కవిత
ముంబై: బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ సైనికులపై ఒక కవిత రాసి ప్రత్యేక సందేశం అందించారు. సైనికులకు దీపావళి శుభాకాంక్షలు పంపాలన్న మోదీ పిలుపుతో దీన్ని రాసి ట్విటర్‌లో పోస్ట్ చేశారు.
అందులో షారూక్ ‘మన పాదాలు తివాచీల మీద. వారి బూట్లు నేలపైన. మన రోజులు ప్రశాంతం. వారికి రోజూ కొత్త సవాళ్లు. మన రాత్రులు ఆహ్లాదకరం... వారి త్యాగాల వల్లే మనం జీవిస్తున్నాం. వారి కష్టం మరుగున పడిపోకూడదు... వారు పోరాటం చేస్తున్నారు. అందుకే దేశం ఎదుగుతోంది. త్రివర్ణ పతాకం ఎగురుతోంది’ అంటూ రాశారు.