నటి క్షమాపణలు.. షారుక్ ఇంప్రెస్! | actress explains shahrukh to why she says no his movie | Sakshi
Sakshi News home page

నటి క్షమాపణలు.. షారుక్ ఇంప్రెస్!

Published Sun, May 21 2017 12:36 PM | Last Updated on Tue, Sep 5 2017 11:40 AM

నటి క్షమాపణలు.. షారుక్ ఇంప్రెస్!

నటి క్షమాపణలు.. షారుక్ ఇంప్రెస్!

బాలీవుడ్: బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ మూవీలో అవకాశం వస్తుందంటే హీరోయిన్లు ఎగ్జైట్ అవుతారు. అయితే ఇటీవల షారుఖ్, ఆనంద్ ఎల్.రాయ్ డైరెక్షన్‌లో ఓ మూవీ తీయడానికి సిద్ధమయయ్యాడు. ఆయనకు జోడీగా ఎవరిని ఎంచుకుంటారన్న దానిపై కొన్ని ఊహాగానాలు వెలువడ్డాయి. షారుక్‌కు ఎంతగానో అచ్చొచ్చే నటి దీపికా పదుకొనేకు తొలుత ఛాన్స్ ఇచ్చారని ప్రచారం జరిగింది, ఆపై కత్రినాను సంప్రదించారని వదంతులు ప్రచారం అయ్యాయి. చివరికి ఆలియా భట్‌ను ఈ మూవీ కోసం సంప్రదించారట. అయితే ఆమె మాత్రం ఈ మూవీలో నటించేందుకు ఒప్పుకొలేదట. ఈ విషయంపై షారుక్ కాస్త సీరియస్ అయ్యారన్న వార్త ఆలియా చెవిన పడింది.

అంతటి స్టార్ హీరో తనపై అభిప్రాయం మార్చుకునే ఛాన్స్ ఉందని భావించిన ఈ ముద్దుగుమ్మ స్టార్ డైరెక్టర్ కరణ్ జోహర్ సలహా మేరకు నేరుగా షారుక్ ఇంటికి వెళ్లింది. డియర్ జిందగీ మూవీలో జతకట్టిన నటి రెండోమూవీకి నో చెప్పడానికి కారణాలు వివరించింది. రణ్‌వీర్‌సింగ్‌తో 'గల్లీ బాయ్', రణ్‌బీర్ కపూర్‌తో 'డ్రాగన్' మూవీలకు తాను ఇచ్చిన కాల్షీట్లను నేరుగా షారుక్ చేతిలో పెట్టింది. ఈ బిజీ షెడ్యూల్ ఉన్నా తనకు ఛాన్స్ ఇవ్వాలని భావిస్తే డేట్స్ అడ్జస్ట్ చేసుకోవాలని.. మూవీకి నో చెప్పినందుకు తనను క్షమించాలని కోరింది. దీంతో షారుక్ కోపం పోయి ఆలియా నిజాయితీకి, ఆమె వివరణ ఇచ్చుకున్న తీరుకు బాద్‌షా ఇంప్రెస్ అయ్యారని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement