
‘జీరో’ సినిమా తర్వాత షారుఖ్ ఖాన్ చేసే సినిమాకు దర్శకుడు ఎవరు? అంటే... తమిళ దర్శకుడు అట్లీ పేరు బాగా వినిపించింది. దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ కాంబినేషన్‌లో ‘పఠాన్’ సినిమా ఆరంభించారు షారుఖ్. ఈ చిత్రం తర్వాత రాజ్‌కుమార్ హిరాణీ, రాజ్ అండ్ డీకే దర్శకత్వాల్లో సినిమాలు ఉంటాయనే కథనాలు బాలీవుడ్‌లో వినిపించాయి. దీంతో షారుఖ్ – అట్లీ కాంబినేషన్ సినిమా దాదాపు లేనట్లే అని చాలామంది అనుకున్నారు. అయితే ఆగస్టు నుంచి ఈ సినిమా ప్రారంభం కానుందనే వార్త తాజాగా ప్రచారంలోకొచ్చింది.
అంతేకాదు... ఇకపై ఎలాంటి కన్‌ఫ్యూజన్, కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకూడదని అట్లీ కూడా కొంతకాలం ముంబైలోనే ఉండాలని అనుకుంటున్నారట. ఇందుకోసం ఆఫీస్ వెతుకుతున్నారట. అయితే ఇంత సడన్‌గా వీరి సినిమా తెరపైకి రావడానికి కారణం దర్శకులు రాజ్‌కుమార్ హిరాణీ, రాజ్ అండ్ డీకేలతో షారుఖ్ సినిమాలు లేకపోవడమే అనే ప్రచారం బీ టౌన్‌లో వినిపిస్తోంది. మరి... ‘పఠాన్’ తర్వాత షారుఖ్ ఏ దర్శకుడితో సినిమాని పట్టాలెక్కిస్తారో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment