లిప్‌లాక్‌ సీన్‌ కోసం కీర్తి సురేష్‌కు కండిషన్‌ | Keerthy Suresh Break Her Condition Over Kiss Scenes In Movies, Deets Inside | Sakshi
Sakshi News home page

లిప్‌లాక్‌ సీన్‌ కోసం కీర్తి సురేష్‌కు కండిషన్‌

May 21 2024 6:42 AM | Updated on May 21 2024 10:09 AM

Keerthy Suresh Break His Words

ఇండియన్‌ సినిమా పాశ్చాత్య సంస్కృతికి మారి చాలా కాలమే అయ్యింది. అయితే దక్షిణాదిలో సంప్రదాయ విలువలు కొనసాగుతూ వచ్చాయి. కానీ ఇప్పుడు ఇక్కడా వాటికీ కట్టలు తెంచుకుంటున్నాయి. ముఖ్యంగా లిప్‌లాక్‌ సన్నివేశాల్లో నటించడానికి మన కథానాయకలు సంకోచించే వారు. అయితే ఇప్పుడు అలాంటి సన్నివేశాలు పుంకాను పుంకాలుగా చూస్తున్నాం. అదేమంటే అలా నటించడంలో తప్పేంటి అనే ప్రశ్న ఎదురవుతోంది. కాగా నటి కీర్తి సురేష్ విషయానికి వస్తే ఈమె తమిళంలో గానీ, తెలుగులో గానీ పరిమితులు దాటని పాత్రల్లో నటిస్తూ పక్కింటి అమ్మాయి ఇమేజ్‌ను తెచ్చుకున్నారు. 

ఇక మహానటి చిత్రంలో అయితే సంసృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా నటించి ప్రశంసలు అందుకున్నారు.ఆ తరువాత గ్లామర్‌ పాత్రల్లో నటించినా హద్దులు దాటలేదు. అలాంటిది ఎప్పుడైతే బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చారో అప్పుడే పాశ్చాత్య సంసృతికి మారిపోయారని సమాచారం. ప్రస్తుతం ఈమె బేబీజాన్‌ అనే  చిత్రంతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. వరుణ్‌ దావన్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు అట్లీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో లిప్‌లాక్‌ సన్నివేశంలో నటించాలని ముందుగానే కండిషన్‌ పెట్టారట. బాలీవుడ్‌లో రాణించాలంటే అలాంటి సన్నివేశాల్లో నటించడం తప్పదని భావించిన కీర్తి సురేష్ బేబీజాన్‌ చిత్ర దర్శక నిర్మాతలకు ఓకే చెప్పారట. 

అలా ఆమె ఆ చిత్రంలో లిప్‌లాక్‌ సన్నివేశాల్లో నటించారని తాజా సమాచారం. ఆ సన్నివేశాలు ఎంత కిక్‌ ఇస్తాయో చిత్రం విడుదలైన తరువాత తెలుస్తుంది. కాగా మరో విషయం ఏమిటంటే ఈమె ఇంతకు ముందు కోట్ల రూపాయలు ఇచ్చినా లిప్‌లాక్‌ సన్నివేశాల్లో నటించను అని ఒక స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. ఆ విషయాన్ని ఇప్పుడు నెటిజన్లు ట్రోలింగ్‌ చేస్తున్నారు. ఇకపోతే ఇటీవల కీర్తి సురేష్ తరచూ వార్తల్లో ఉంటున్నారు. తాజాగా తను తలకిందులుగా వర్కౌట్స్‌ చేస్తున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement