
బాలీవుడ్‌లో కొత్త డాన్ వచ్చాడు. ‘మై హూ డాన్’ అంటున్నారు రణ్‌వీర్ సింగ్. షారుక్ ఖాన్ హీరోగా ‘డాన్: ది చేజ్ బిగిన్స్ ఎగైన్’, ‘డాన్ 2: ది కింగ్ ఈజ్ బ్యాక్’ సినిమాలను డైరెక్ట్ చేసిన ఫర్హాన్ అక్తర్ బుధవారం ‘డాన్ 3’ సినిమాను ప్రకటించారు.
ఇందులో డాన్‌గా రణ్‌వీర్ సింగ్ నటించనున్నట్లు వెల్లడించారు. ‘నిద్ర పోతున్న సింహం లేచిందని ప్రపంచానికి తెలియాలి.. వెళ్లి చెప్పు.. నేను తిరిగొస్తున్నానని’, ‘నేనే డాన్‌ని..’ అనే డైలాగ్స్ ‘డాన్ 3’ అనౌన్స్‌మెంట్ వీడియోలో వినిపిస్తాయి. ‘డాన్ 3’ సినిమా షూటింగ్‌ను ఈ ఏడాది చివర్లో ప్రారంభించి, 2025లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు.