Don -3
-
Ranveer Singh : గూఢచారిగా ‘రణ్వీర్ సింగ్?
హీరో రణ్వీర్ సింగ్, ‘ఉరి’ ఫేమ్ ఆదిత్యాథార్ కాంబినేషన్ లో ఓ యాక్షన్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కనుందనే టాక్ బాలీవుడ్లో వినిపిస్తోంది. ప్రస్తుతం అజయ్ దేవగన్ హీరోగా చేస్తున్న ‘సింగమ్ ఎగైన్ ’ సినిమాలో ఓ లీడ్ రోల్ చేస్తున్నారు రణ్వీర్ సింగ్. ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది. ‘సింగమ్ ఎగైన్’ లో తన పాత్ర షూటింగ్ పూర్తి కాగానే ఫర్హాన్ అక్తర్ డైరెక్షన్లో ‘డాన్ 3’ సెట్స్‌లో రణ్వీర్ జాయిన్ అవుతారు. ఆ సినిమా చిత్రీకరణ ఓ కొలిక్కి రాగానే సూపర్ హీరో ఫిల్మ్ ‘శక్తిమాన్ ’ను రణ్వీర్ ప్రాంరంభించాలనుకున్నారు. కానీ ‘డాన్3’ సెట్స్‌కి వెళ్లేందుకు సమయం పడుతుందట. దీంతో ఈ లోపు ఆదిత్యాథార్ చెప్పిన ఓ స్పై యాక్షన్ థ్రిల్లర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట రణ్వీర్. ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో రణ్వీర్ రోల్ కొత్తగా ఉంటుందని బీ టౌన్ టాక్. ఈ చిత్రంలో రణ్వీర్ గూఢచారిగా కనిపించనున్నారని ప్రచారం సాగుతోంది. వేసవి నుంచి చిత్రీకరణను ప్లాన్ చేస్తున్నారట. -
కొత్త డాన్ వచ్చేశాడు.. షారుక్ ప్లేస్‌లో
బాలీవుడ్లో కొత్త డాన్ వచ్చాడు. ‘మై హూ డాన్’ అంటున్నారు రణ్వీర్ సింగ్. షారుక్ ఖాన్ హీరోగా ‘డాన్: ది చేజ్ బిగిన్స్ ఎగైన్’, ‘డాన్ 2: ది కింగ్ ఈజ్ బ్యాక్’ సినిమాలను డైరెక్ట్ చేసిన ఫర్హాన్ అక్తర్ బుధవారం ‘డాన్ 3’ సినిమాను ప్రకటించారు. ఇందులో డాన్‌గా రణ్వీర్ సింగ్ నటించనున్నట్లు వెల్లడించారు. ‘నిద్ర పోతున్న సింహం లేచిందని ప్రపంచానికి తెలియాలి.. వెళ్లి చెప్పు.. నేను తిరిగొస్తున్నానని’, ‘నేనే డాన్ని..’ అనే డైలాగ్స్ ‘డాన్ 3’ అనౌన్స్మెంట్ వీడియోలో వినిపిస్తాయి. ‘డాన్ 3’ సినిమా షూటింగ్‌ను ఈ ఏడాది చివర్లో ప్రారంభించి, 2025లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
ఆవిడ కాదు... ఈవిడేనట!
గాసిప్ ‘డాన్-3’లో హీరోయిన్ ఎవరు? ఎ) ప్రియాంక చోప్ర బి) కరీనా కపూర్ సి) సోనమ్ కపూర్ డి) ఎవరూ కాదు ‘ఎవరూ కాదు’ అనే జవాబుకే ఎక్కువమంది మొగ్గు చూపారు. ఎందుకంటే ‘డాన్-3’ లో కత్రినా కైఫ్ నటించబోతుందనే వార్త హల్చల్ చేసింది.‘‘యస్... ఆ చిత్రంలో నటిస్తున్నాను’’ అని కత్రినా కన్ఫాం చేసినట్లు గుసగుసలు గట్టిగా వినిపించాయి. అయితే ఇదంతా ఉత్తదేననే వార్తలు అంతకంటే గట్టిగా వినిపించాయి. ‘డాన్-2’ నిర్మాత రితేష్ ఇలా ట్వీట్ చేశాడు... ‘డాన్-3 గురించి, నటీనటుల గురించిఏవేవో వార్తలు వినిపిస్తున్నాయి. స్క్రిప్ట్ వర్క్ ఇంకా జరుగుతూనే ఉంది. నటీనటులను మార్చాలనుకోవడం లేదు’ ‘ఎవరినీ మార్చాలనుకోవడం లేదు’ అని ఒకవైపు రితేష్ అంటున్నా... మరోవైపు కత్రినా ఇమేజ్‌కు తగినట్లు ‘డాన్-3’ స్క్రిప్ట్‌లో చాలామార్పులు చేస్తున్నట్లు లేటెస్ట్ వినికిడి.