
ఆవిడ కాదు... ఈవిడేనట!
గాసిప్
‘డాన్-3’లో హీరోయిన్ ఎవరు?
ఎ) ప్రియాంక చోప్ర
బి) కరీనా కపూర్
సి) సోనమ్ కపూర్
డి) ఎవరూ కాదు
‘ఎవరూ కాదు’ అనే జవాబుకే ఎక్కువమంది మొగ్గు చూపారు. ఎందుకంటే ‘డాన్-3’ లో కత్రినా కైఫ్ నటించబోతుందనే వార్త హల్‌చల్ చేసింది.‘‘యస్... ఆ చిత్రంలో నటిస్తున్నాను’’ అని కత్రినా కన్‌ఫాం చేసినట్లు గుసగుసలు గట్టిగా వినిపించాయి. అయితే ఇదంతా ఉత్తదేననే వార్తలు అంతకంటే గట్టిగా వినిపించాయి. ‘డాన్-2’ నిర్మాత రితేష్ ఇలా ట్వీట్ చేశాడు... ‘డాన్-3 గురించి, నటీనటుల గురించిఏవేవో వార్తలు వినిపిస్తున్నాయి.
స్క్రిప్ట్ వర్క్ ఇంకా జరుగుతూనే ఉంది. నటీనటులను మార్చాలనుకోవడం లేదు’ ‘ఎవరినీ మార్చాలనుకోవడం లేదు’ అని ఒకవైపు రితేష్ అంటున్నా... మరోవైపు కత్రినా ఇమేజ్‌కు తగినట్లు ‘డాన్-3’ స్క్రిప్ట్‌లో చాలామార్పులు చేస్తున్నట్లు లేటెస్ట్ వినికిడి.