
హీరో రణ్‌వీర్ సింగ్, ‘ఉరి’ ఫేమ్ ఆదిత్యాథార్ కాంబినేషన్ లో ఓ యాక్షన్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కనుందనే టాక్ బాలీవుడ్‌లో వినిపిస్తోంది. ప్రస్తుతం అజయ్ దేవగన్ హీరోగా చేస్తున్న ‘సింగమ్ ఎగైన్ ’ సినిమాలో ఓ లీడ్ రోల్ చేస్తున్నారు రణ్‌వీర్ సింగ్. ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది. ‘సింగమ్ ఎగైన్’ లో తన పాత్ర షూటింగ్ పూర్తి కాగానే ఫర్హాన్ అక్తర్ డైరెక్షన్‌లో ‘డాన్ 3’ సెట్స్‌లో రణ్‌వీర్ జాయిన్ అవుతారు. ఆ సినిమా చిత్రీకరణ ఓ కొలిక్కి రాగానే సూపర్ హీరో ఫిల్మ్ ‘శక్తిమాన్ ’ను రణ్‌వీర్ ప్రాంరంభించాలనుకున్నారు.
కానీ ‘డాన్3’ సెట్స్‌కి వెళ్లేందుకు సమయం పడుతుందట. దీంతో ఈ లోపు ఆదిత్యాథార్ చెప్పిన ఓ స్పై యాక్షన్ థ్రిల్లర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట రణ్‌వీర్. ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో రణ్‌వీర్ రోల్ కొత్తగా ఉంటుందని బీ టౌన్ టాక్. ఈ చిత్రంలో రణ్‌వీర్ గూఢచారిగా కనిపించనున్నారని ప్రచారం సాగుతోంది. వేసవి నుంచి చిత్రీకరణను ప్లాన్ చేస్తున్నారట.
Comments
Please login to add a commentAdd a comment