
షారుక్ ఖాన్
ఫిల్మ్ ఇండస్ట్రీలో పారితోషికాలు జెండర్‌ని బట్టి ఉంటాయనే వాదన ఎప్పటి నుంచో నడుస్తూనే ఉంది. ‘‘పారితోషికం అనేది ప్రతిభను బట్టి ఇవ్వాలి కానీ జెండర్‌ని బట్టి డిసైడ్ అవ్వకూడదు’’ అన్నారు షారుక్ ఖాన్. ఈ పారితోషికం వ్యత్యాసాల గురించి ఆయన మాట్లాడుతూ – ‘‘స్త్రీ, పురుషుల్లో ఎవరు ఎక్కువ? ఎవరు తక్కువ? అనే వైఖరి కరెక్ట్ కాదు. ఇద్దరూ సమానమే. వాళ్ల పారితోషికం కూడా అలానే డిసైడ్ చేయాలి. స్త్రీలు మన ల్ని (మగవాళ్లను) ఇంకా గొప్పగా ఆలోచించేలా తీర్చిదిద్దుతారు. మనల్ని ఇంకా బెటర్ పర్సన్‌గా మారుస్తారు. ఇప్పటికీ వాళ్లకు రావాల్సిన క్రెడిట్, రెమ్యునరేషన్ రాకపోవడం కరెక్ట్ కాదు’’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment