Syed Mushtaq Ali T20 Trophy Final: MS Dhoni Watches Shahrukh Khan’s Last-Ball Six to Win - Sakshi
Sakshi News home page

MS Dhoni- Shahrukh Khan: అరె అచ్చం నాలాగే.. కొట్టేశావు పో..! షారుఖ్‌ సిక్సర్‌.. ధోని ఫొటో వైరల్‌

Published Tue, Nov 23 2021 7:52 AM | Last Updated on Tue, Nov 23 2021 8:25 AM

MS Dhoni Watches Shahrukh Khan Hit Last Ball Six SMAT Final Goes Viral - Sakshi

MS Dhoni Watches Shahrukh Khan Hit Last Ball Six SMAT Final Goes Viral: ఆఖరి బంతికి సిక్స్‌ కొట్టి జట్టును గెలిపిస్తే ఆ కిక్కే వేరప్పా.. అది కూడా ఆ ‘విన్నింగ్‌ షాట్‌’తో టైటిల్‌ సొంతమైతే..!! ఇక చెప్పేదేముంటుంది!! ఇలాంటి మజాను ఎన్నోసార్లు ఆస్వాదించాడు టీమిండియా మాజీ సారథి, మిస్టర్‌ కూల్‌ ఎంఎస్‌ ధోని. తనదైన శైలిలో ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చి జట్టును విజయాల బాట పట్టించాడు ఈ చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌.

అచ్చంగా అలాగే.. ధోని మాదిరిగానే తమిళనాడు క్రికెటర్‌ షారూఖ్‌ ఖాన్‌ సైతం.. చివరి బంతికి సిక్సర్‌ బాది తమ జట్టుకు విజయం అందించాడు. తమిళనాడు మూడోసారి సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ ఫైనల్‌ ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ మైదానంలో జరిగిన సంగతి తెలిసిందే. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో కర్ణాటకపై తమిళనాడు జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చివరి బంతికి 5 పరుగులు అవసరమైన సమయంలో షారుఖ్‌ ఖాన్‌ సిక్స్‌ కొట్టడంతో విజయం ఖరారైంది. 


PC: BCCI

ఈ నేపథ్యంలో తలా ధోని షారుఖ్‌ షాట్‌ను వీక్షిస్తున్న దృశ్యాలను చెన్నై సూపర్‌కింగ్స్‌ ఫ్రాంఛైజీ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ‘‘ధోని తరహాలో ఫినిషింగ్‌!’’ అంటూ హర్షం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్‌ అవుతోంది. ఇక పంజాబ్‌ కింగ్స్‌ సైతం తమ జట్టు ఆటగాడి అద్భుత విజయాన్ని ఉటంకిస్తూ... ‘‘నువ్వు అందరి మనసులు గెలిచావు’’ అంటూ ఆనందాన్ని పంచుకుంది. 

చదవండి: Rahul Dravid: నా ఫస్ట్‌లవ్‌ ద్రవిడ్‌.. తన కోసం మళ్లీ క్రికెట్‌ చూస్తా: నటి
చదవండి: MS Dhoni: ‘నా చివరి మ్యాచ్‌ చెన్నైలోనే’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement