ఆరంభం అప్పట్నుంచేనా..? | Venkatesh and Anil Ravipudi Combination Movie Updates | Sakshi
Sakshi News home page

ఆరంభం అప్పట్నుంచేనా..?

Published Sun, Mar 24 2024 6:17 AM | Last Updated on Sun, Mar 24 2024 6:17 AM

Venkatesh and Anil Ravipudi Combination Movie Updates - Sakshi

‘ఎఫ్‌ 2’, ‘ఎఫ్‌ 3’ (వరుణ్‌ తేజ్‌ మరో హీరో) చిత్రాల తర్వాత హీరో వెంకటేశ్, దర్శకుడు అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కనుందనే టాక్‌ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో హీరోయిన్‌గా త్రిష, మృణాల్‌ ఠాకూర్‌ వంటి వార్ల పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ సినిమాకు ‘సంక్రాంతికి వస్తున్నాం’ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

తాజాగా ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ను మే చివర్లో లేదా జూన్‌ మొదటి వారంలో ్రపారంభించాలని చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోందని తెలిసింది. అలాగే ఈ సినిమాను ‘దిల్‌’ రాజు నిర్మించనున్నారని, సంక్రాంతికి రిలీజ్‌ చేయాలన్నది చిత్ర యూనిట్‌ టార్గెట్‌ అని సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement