సంక్రాంతి బరిలో వెంకీమామ.. రిలీజ్ డేట్‌ వచ్చేసింది! | Tollywood Hero Venkatesh New Movie Release Date Announced | Sakshi
Sakshi News home page

Sankranthiki Vasthunam: ఆ రోజే సంక్రాంతికి వస్తున్నాం.. వెంకీమామ మూవీ రిలీజ్ డేట్ ఇదే!

Published Wed, Nov 20 2024 5:31 PM | Last Updated on Wed, Nov 20 2024 7:17 PM

Tollywood Hero Venkatesh New Movie Release Date Announced

టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్‌ నటిస్తోన్న సంక్రాంతి వస్తున్నాం. వెంకీ- అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ చిత్రం పొంగల్ బరిలో నిలిచింది. ఈ ఈ ట్రయాంగిల్‌ క్రైమ్‌ డ్రామా ఫిల్మ్‌లో మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో మాజీ పోలీసాఫీసర్‌ పాత్రలో వెంకటేశ్‌ కనిపించనున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న హ్యట్రిక్ చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇటీవల టైటిల్‌ ప్రకటించిన మేకర్స్ తాజాగా మరో అప్‌డేట్ ఇచ్చారు. ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు వెంకటేశ్ గన్ చేతిలో పట్టుకుని.. పంటకట్టులో కనిపిస్తోన్న ఫోటోను షేర్ చేశారు. సంక్రాంతికి వస్తున్నా.. విక్టరీ వినోదాన్ని పంచుతున్నాం అని క్యాప్షన్ కూడా ఇచ్చారు. కాగా.. ఈ చిత్రానికి భీమ్స్‌ సిసిరోలియో సంగీతమందిస్తున్నారు.  ఈ చిత్రాన్ని ‘దిల్‌’ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై శిరీష్‌ నిర్మిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement