సంక్రాంతి పండగ అంటేనే పిండివంటలు.భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఇలా నాలుగు రోజులు అనేక రకాల పిండి వంటలు తయారు చేసుకుంటారు. అరిశెలులు, సున్నుండలు, సకినాలు, పొంగడాలు, జంతికలు, తీపి బూంది ఇలా ఆయా ప్రాంతాలను బట్టి వీటికి ప్రాధాన్యత ఉంటుంది. ఇంకా పొంగల్, పరమాన్నం, బెల్లం అన్నం ఇలా ఒక్కో చోట ఒక్కో రకం. కానీ కనుమ రోజు అయితే మాంసాహార ప్రియులకు పండగే. మరీ ముఖ్యంగా గారెలు, నాటుకోడి పులుసు మరింత ప్రత్యేకం. మరి క్రిస్పీగా గారెలు ఎలా తయారు చేయాలో చూద్దాం!
ప్రాంతం ఏదైనా, పండగ ఏదైనా మినపగారెలు , నాటు కోడి కాంబినేషన్ చాలా ఫ్యామస్. ఈ రెండింటి కాంబినేషన్ రుచితోపాటు, ప్రోటీన్లను కూడా అధికంగా అందిస్తాయి.
తయారీ
ముందుగా 2 కప్పుల మినపప్పు, కొంచెం బియ్యం వేసి కనీసం నాలుగైదు గంటల పాటు నానెబట్టుకోవాలి. ఇందులో ఇనుప గరిటె, లేదా అట్ల కాడ వేస్తే తొందరగా నానుతుందని చెబుతారు. పొట్టు పప్పుఅయితే పొట్టు పోయేలా శుభ్రంగా కడుక్కోవాలి. నీళ్లు లేకుండా వంపుకోవాలి. దీన్ని మెత్తగా, కొంచెం గట్టిగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి(రుబ్బుకుంటే ఇంకా బావుంటుంది). ఇందులో పచ్చిమిర్చి,కొత్తిమీర,అల్లం, మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు కలిపి బాగా కలుపుకోవాలి.
తరువాత స్టవ్‌మీద బాండ్లీ పెట్టుకుని ఆయిల్ వేసి బాగా కాగనివ్వాలి. గారెలు వేసే ముందు నీటితో చేతులను తడి చేసుకుని, అరిటాకుపై చక్కగా గుండ్రంగా అద్దుకోవాలి,మధ్యలో మధ్యలో చిన్న రంధ్రం చేసి వేడి నూనెలో జాగ్రత్తగా వేయాలి. ఆ తర్వాత మీడియం మంటపై గారెలను రెండు వైపులా సమానంగా వేయించుకోవాలి. దీని వల్ల నూనె ఎక్కువగా పీల్చకుండా ఉంటాయి. టిష్యూ పేపర్ వేసిన గిన్నెలో వేసుకుంటే అదనపు నూనెను పీల్చేస్తుంది.
నాటుకోడి పులుసు తయారీ
ముందుగా నాటు కోడి(మరీ ముదురు కాకుండాస్త్ర మాంసాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఆయిల్, పసుపు వేసి మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
ఇపుడు అనాస పువ్వు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు,ఎండుమిర్చి, లవంగాలు,యాలకులు, వెల్లుల్లి, జాజికాయ ,స్పూన్ ధనియాలను నూనెలేకుండా మూకుడులో దోరగా వేయించుకిన పొడి చేసి పెట్టుకోవాలి.
అలాగే జీడిపప్పు,ఎండు కొబ్బరి , గసగసాలు,సారపప్పు జీలకర్ర కలిపి మెత్తగా మిక్సీ లో పేస్ట్ చేసుకోవాలి.
కుక్కర్‌లో తగినంత నూనె వేసి వేడి చేసుకోవాలి. ఇందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకుని యించుకోవాలి. వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరికాసేపు ఫ్రై చేయాలి. ఇపుడు ఉప్పు, పసుపు, కారం యాడ్ చేసుకుని మరికాసేపు వేయించుకోవాలి. ఇందులో ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ పెరుగు వేసి, సన్న మంట మీద మరికొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. నూనె పైకి తేలాక, మ్యారినేట్ చేసుకున్ననాటుకోడి ముక్కల్ని వేసి కొద్దిగా వేగనివ్వాలి. తరువాతమసాలా పేస్ట్, కొద్దిగా కారం,ఉప్పు కూడావేసి బాగా కలిపి వేగనివ్వాలి. ఉప్పు, కారం టేస్ట్ చెక్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి..అనంతరం కుక్కర్ మూత పెట్టి ఐదారు విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించుకోవాలి. మూత వచ్చాక,ముందుగా రెడీ చేసుకున్న మసాలా పొడిని కొత్తిమీర, పుదీనా చల్లుకోవాలి. వాటర్ మరీ ఎక్కువగా ఉంటే మరికొద్దిసేపు చిక్కగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. అంతే ఘుమఘుమలాటే, టేస్టీ టేస్టీ నాటుకోటి పులుసురెడీ.
ఈ నాటుకోడి పులుసుతో లేదా చికెన్ కూరతో వేడి వేడి గారెలను నంజుకుని తింటే ఆహా ఏమి రుచి అంటారు.
ఇదీ కూడా చదవండి: Kanuma Importance: కనుమ పండుగ ఈ విశేషాలు తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment