kanuma festival
-
కనుమ విశిష్టత..ఆ రోజు ప్రయాణాలు ఎందుకు చెయ్యరంటే..
సంక్రాంతి తర్వాతి రోజు వచ్చే పండుగ కనుమ. ఈ రోజున పశువులను ఎందుకు పూజిస్తారు?. పైగా ఈ రోజు ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రయాణాలు చెయ్యరు ఎందుకు?. తదితరాల గురించి తెలుసుకుందాం! సంక్రాంతి వేడుకల్లో ఈ మూడవ రోజును పశువులకు కృతజ్ఞతలు తెలపడానికి కేటాయిస్తారు. కాబట్టి ఇది కనుమ పండుగ. నిజానికి వ్యవసాయంలో తమకు ఎంతో చేదోడువాదోడు ఉన్న పశువులను రైతులు తమ కుటుంబసభ్యులుగా భావిస్తారు. కాబట్టి ఈ కనుమ పండుగను 'పశువుల పండుగ' అని కూడా సంబోధిస్తుంటారు. ముఖ్యంగా పల్లెటూళ్లలో ఈ పండుగను ఎంతో ప్రత్యేకంగా ఓ వేడుకలా జరుపుతుంటారు. ఈ రోజు పశువులను అందంగా అలంకరించి పూజలు చేస్తారు. కొందరైతే కొమ్ములకు ఇత్తడి తొడుగులు, మూపురాల మీద పట్టుబట్టలు, కాళ్లకి గజ్జలు, మెడలో పూలదండలు.. ఇలా చక్కగా అలంకరిస్తారు. పశువులతో పాటూ పక్షులను కూడా ఆదరించే సంప్రదాయం ఉంది. అందుకే ధాన్యపు కంకులను ఇంటి చూర్లకు వేలాడదీస్తారు. వాటికోసం ఇంటి చుట్టూ చేరిన చిన్న చిన్నపిట్టలు, పక్షుల కిలకిలరావాలతో ఆ ప్రాంగణం అంతా ఆహ్లాదకరంగా ఉంటుంది. పంట చేతికందేందుకు సహాయపడిన వారిందరికీ ఈ రోజున కొత్త బట్టలు కూడా పెడతారు. ఇక కనుమ రోజున మాంసాహారం తినడం ఆంధ్ర దేశాన ఆనవాయితీగా వస్తోంది. మాంసాహారులు కాని వారు, గారెలతో (మినుములో మాంసకృతులు హెచ్చుగా ఉంటాయి కనుక ఇది శాకాహారులకు మాంసంగా ఉపయోగ పడుతోంది.) సంతృప్తి పడతారు. ఆ రోజు ప్రయాణాలు ఎందుకు చెయ్యరంటే.. సంక్రాంతి అంటే మూడు రోజుల పండుగ. దీంతో ప్రతీ లోగిలి బంధువులతో కళకళాలాడుతూ కన్నుల పండుగగా ఉంటుంది. అందువల్ల ఈ మూడో రోజు ఎవరిళ్లకు వాళ్లు ప్రయాణం కావడం వల్ల చాలా ఆనందాన్ని మిస్ అవుతారనే ఉద్దేశ్యంతో బహుశా కనుమ రోజు ప్రయాణం చేయొద్దని చెబుతుంటారు పెద్దలు. ఈ కారణంతోనే ‘కనుమ రోజు కాకి కూడా కదలదు’ అనే సామెత వచ్చి ఉండొచ్చు. మరికొందరైతే ఇలా పెద్దలు చెప్పారంటే దాని వెనుక ఏదో ఆంతర్యం ఉంటుందని ప్రగాఢంగా విశ్వసిస్తారు. అదీగాక ఈ కనుమ రోజు ఎక్కడికైనా ప్రయాణం చేస్తే వెళ్లిన పని పూర్తికాదని, ఆటంకాలు తప్పవని నమ్మకం కూడా ప్రబలంగా ఉంది. అందువల్లే చాలామంది కనమ రోజున ప్రయాణాలు ఎట్టిపరిస్థితుల్లో చెయ్యరు. (చదవండి: సంక్రాంతి వైభవాన్ని కనుమా!) -
Makar Sankranti 2024: సంక్రాంతి వైభవాన్ని కనుమా!
భారతీయులు అందులోనూ దాక్షిణాత్యులు, ముఖ్యంగా తెలుగువారు సంక్రాంతిని ఎంతో వైభవోపేతంగా చేసుకుంటారు. ఆడపడుచులు, అల్లుళ్లతో సహా సంక్రాంతికి మాత్రం తమ స్వగ్రామాలకి చేరుకుంటారు అందరు. సంక్రాంతి వైభవం అంతా పల్లెలలో చూడాలి. సంక్రాంతి పండుగ సమయానికి పంటలు ఇంటికి వచ్చి రైతులు, వ్యవసాయ కూలీలు గ్రామంలో ఉన్న అందరు కూడా పచ్చగా ఉంటారు. ప్రకృతి కూడా పచ్చగా కంటికి ఇంపుగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ΄పొలం పనులు పూర్తి అయి కాస్త విశ్రాంతి తీసుకునే వీలుండటంతో సందడి, సంబరాలు. తమకి ఇంతటి భద్రత కలగటానికి మూలమైన భూమిని, రైతులను, కూలీలను, పాలేర్లను, పశువులను, పక్షులను అన్నింటికి కృతజ్ఞతను తెలియచేయటం, తమ సంపదను సాటివారితో బంధుమిత్రులతో పంచుకోవటం ఈ వేడుకల్లో కనపడుతుంది. భారతీయులు చాంద్రమానంతో పాటు కొన్ని సందర్భాలలో సూర్యమానాన్ని కూడా అనుసరిస్తారు. అటువంటి వాటిల్లో ప్రధానమైనది మకరసంక్రమణం. మకరసంక్రమణంతో సూర్యుడి గమనం దిశ మారుతుంది. అప్పటి వరకు దక్షిణదిశగా నడచిన నడక ఉత్తర దిక్కుగా మళ్ళుతుంది. అందుకే ఆ రోజు నుండి ఆరునెలలు ఉత్తరాయణం అంటారు. అప్పటికి ఆరునెలలనుండి దక్షిణాయనం. ఈ పుణ్య సమయంలో చేయవలసిన విధులు కూడా ఉన్నాయి. వాటన్నింటిని సంక్రాంతి సంబరాల్లో మేళవించటం జరిగింది. ► విధులు అంతరిక్షంలో జరిగే ఖగోళవిశేషాల ననుసరించి ప్రకృతిలో వచ్చే మార్పులకు అనుగుణంగా మనుషులు చేయవలసిన పనులను పండుగ విధులుగా చెప్పటం మన ఋషుల ఘనత. అవి మనిషి వ్యక్తిగత, కుటుంబపరమైన, సామాజిక క్షేమాలని కలిగించేవిగాను ఖగోళ, ఆయుర్వేద, ఆర్థిక మొదలైన శాస్త్రవిజ్ఞాన్ని అందించేవిగా ఉంటాయి. ఆధ్యాత్మికంగా ఉన్నతస్థాయికి ఎదగటానికి సహాయం చేసేవిగా ఉంటాయి. మన పండుగలు బహుళార్థసాధక ప్రణాళికలు. అన్నింటిని సమీకరించి ఎప్పుడేం చెయ్యాలో చక్కగా చె΄్పారు. ► పెద్దపండగ సంక్రాతిని పెద్దపండగ అంటారు. చాలా పెద్ద ఎత్తున చేసుకోవటంతో పాటు ఎక్కువ రోజులు చేసుకుంటారు. సంక్రమణం జరిగే రోజు పండుగ, ముందురోజు భోగి, మూడవరోజు కనుము. నాలుగవ రోజు ముక్కనుము. నిజానికి పండుగ వాతావరణం నెలరోజుల ముందు నుండే నెలకొంటుంది. ► నెల పట్టటం సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించినప్పటి నుండి ధనుర్మాసం అంటారు. అది డిసెంబరు 15వ తేదీ కాని, 16 వ తేదీ కాని అవుతుంది. అప్పటి నుండి మకర సంక్రమణం వరకు అంటే జనవరి 14వ తేదీ వరకు కాని, 15 వ తేదీ వరకు కాని ఉండే ధనుర్మాసం అంతా ప్రత్యేకంగానే కనపడుతుంది. దీనిని ‘నెలపట్టటం’ అని అంటారు. అంటే ఈ నెల అంతా ఒక ప్రత్యేక మైన పద్ధతిని పాటిస్తామని చెప్పటం. ఇళ్ల ముందు ఆవుపేడ కళ్ళాపిలో అందంగా తీర్చి దిద్దిన రంగవల్లికలు, ఆకాశంలో నుండి క్రిందికి దిగి వచ్చినట్టు కనపడే చుక్కల ముగ్గుల మధ్యలో కంటికింపుగా దర్శనమిచ్చే గొబ్బెమ్మలు, గొబ్బెమ్మల పైన అలంకరించ బడి పలకరించే బంతి, చేమంతి, గుమ్మడిపూలు, వాటిని తొక్క కుండా ‘హరిలో రంగ హరి’ అంటు అందరిని తన మధురగానంతో మేలుకొలుపుతున్న హరిదాసులు, వారు వెళ్ళగానే ‘అయ్యగారికీ దండం పెట్టు, అమ్మగారికీ దండం పెట్టు’ అంటు గంగిరెద్దుల నాడించేవారు, జంగంవారు, బుడబుక్కలవారు ...... తమ కళానైపుణ్యాన్ని ప్రదర్శించే ఎంతోమంది జానపద కళాకారులు – అదొక కలకలం, అదొక కళావిలాసం. ఈ నెల అంతా విశిష్టాద్వైత సంప్రదాయాన్ననుసరించే వారు తిరు΄్పావై లేక శ్రీవ్రతం లేక స్నానవ్రతం అనే దాన్ని ఆచరిస్తారు.ద్వాపరయుగం చివరలో గోపికలు ఆచరించిన ఈ వ్రతాన్ని గోదాదేవి ఆచరించి శ్రీరంగనాథుని వివాహం చేసుకుని ఆయనలో సశరీరంగా లీనమయింది. వైష్ణవదేవాలయాల్లో తెల్లవారుజామునే కృష్ణుని అర్చించి బాలభోగంగా నివేదించిన ప్రసాదాన్ని తెల్లవారక ముందే పంచిపెడతారు. ప్రకృతిలో భాగమైన సర్వజీవులు స్త్రీలు. వారు పరమపురుషుని చేరుకోవటం కోసం చేసే సాధన మధురభక్తి మార్గం. దానికి ప్రతీక అయిన గోదాదేవి చేసిన వ్రతాన్ని ఈ నెలరోజులు సాధకులు, భక్తులు అందరు ఆచరిస్తారు. ఆండాళు తల్లి ఆ రోజుల్లో గోపికలుగా భావించుకున్న తన చెలులను వ్రతం చెయ్యటానికి స్నానం చేద్దాం రమ్మని మేలు కొలుపుతుంది. ఇప్పుడు ఆపని హరిదాసులు చేస్తున్నారు. ► సంక్రాంతి అసలు ప్రధానమైనది సంక్రాంతి, అంటే సంక్రమణం జరిగే రోజు. సూర్యుడు మకరరాశిలో ప్రవేశించే రోజు. ఈ పుణ్య కాలంలో దానాలు, తర్పణాలు ్రపాధాన్యం వహిస్తాయి. ఈ సమయంలో చేసే దానాలకి ఎన్నో రెట్లు ఎక్కువ ఫలితం ఉంటుంది. దానికి కారణం ఈ మూడురోజులు పాతాళం నుండి వచ్చి భూమిని పరిపాలించమని శ్రీమహావిష్ణువు బలిచక్రవర్తికి వరం ఇచ్చాడు. కనుక బలి తనకి ఇష్టమైన దానాలు చేస్తే సంతోషిస్తాడు. అందులోనూ గుమ్మడికాయను దానం చేయటం మరీ శ్రేష్ఠం. గుమ్మడిని దానం ఇస్తే భూగోళాన్ని దానం ఇచ్చినంత ఫలితం. మకరరాశిలో ఉండే శ్రవణానక్షత్రానికి అధిపతి అయిన శని శాంతించటానికి నువ్వుల దానం చేయటం శ్రేయస్కరం. వస్త్రదానం, పెరుగుదానంతో పాటు, ఏ దానాలు చేసినా మంచిదే. భోగినాడు ఏ కారణంగానైనా పేరంటం చేయని వారు ఈ రోజు చేస్తారు. అసలు మూడు రోజులు పేరంటం చేసే వారున్నారు. దక్షిణాయణం పూర్తి అయి పితృదేవతలు తమ స్థానాలకి వెడితే మళ్ళీ ఆరునెలల వరకు రారు కనుక వారికి కృతజ్ఞతా పూర్వకంగా తర్పణాలు ఇస్తారు. కొంతమంది కనుము నాడు తర్పణాలిస్తారు. ► కనుము తమ ఇంటికి పంట వచ్చి ఆనందంగా ఉండటానికి కారణభూతమైన భూదేవికి, రైతులకి, పాలేర్లకి, పశువులకి కూడా తమ కృతజ్ఞతలని తెలియ చేయటం ఈ పండుగలోని ప్రతి అంశంలోనూ కనపడుతుంది. కనుముని పశువుల పండగ అని కూడా అంటారు. ఈ రోజు పశువుల శాలలని శుభ్రం చేసి, పశువులని కడిగి, కొమ్ములకి రంగులు వేసి, పూలదండలని వేసి, ఊరేగిస్తారు. వాటికి పోటీలు పెడతారు. ఎడ్లకి పరుగు పందాలు, గొర్రె΄పొటేళ్ళ పోటీలు, కోడిపందాలు మొదలైనవి నిర్వహిస్తారు. పాలేళ్ళకి ఈరోజు సెలవు. వాళ్ళని కూడా తలంటు పోసుకోమని కొత్తబట్టలిచ్చి పిండి వంటలతో భోజనాలు పెడతారు. సంవత్సరమంతా వ్యవసాయంలో తమకు సహాయం చేసిన వారి పట్ల కతజ్ఞత చూపటం నేర్పుతుంది ఈ సంప్రదాయం. మాంసాహారులు ఈరోజు మాంసాహారాన్ని వండుకుంటారు. సాధారణంగా కోడిపందెంలో ఓడిపోయిన కోడినో, గొర్రెనో ఉపయోగించటం కనపడుతుంది. ఓడిపోయిన జంతువు పట్ల కూడా గౌరవ మర్యాదలని చూపటం అనే సంస్కారం ఇక్కడ కనపడుతుంది. పక్షులు వచ్చి తమ పంట పాడుచేయకుండా ఉండేందుకు, పురుగులని తిని సహాయం చేసినందుకు వాటికి కూడా కృతజ్ఞతను ఆవిష్కరించేందుకు వరి కంకులను తెచ్చి చక్కని కుచ్చులుగా చేసి, ఇంటి ముందు వసారాలలో కడతారు. కొన్ని ్రపాంతాలలో ఇప్పటికీ కనుమునాడు గుడిలో వరికంకుల గుత్తులను కట్టే సంప్రదాయం కొనసాగుతోంది. ‘కనుము నాడు కాకైనా కదలదు’, ‘కనుము నాడు కాకైనా మునుగుతుంది’ అనే సామెతలు కనుముకి పితదేవతలకు ఉన్న సంబంధాన్ని సూచిస్తాయి. ► ముక్కనుము ముక్కనుము నాడు ప్రత్యేకంగా చేయవలసినవి పెద్దగా కనిపించవు. పండగలో అలిసిపోయిన వారి విశ్రాంతి కోసం కావచ్చు. కానీ, కొంతమంది కనుమునాడు కాక ఈ రోజుని మాంసాహారం తినటానికి కేటాయిస్తారు. ఒక పండుగ, అందులోనూ ప్రధానమైన పండుగను చేసుకోవటంలో ఎన్ని అంశాలను మిళితం చేసి, వినోదాన్ని, విజ్ఞానాన్ని, వికాసాన్ని పెంపొందించే విధంగా ప్రయోజనాత్మకంగా రూ΄పొందించారో మన పెద్దలు! – డా. ఎన్.అనంతలక్ష్మి -
మొగలిపువ్వంటీ మొగుడ్నీయవే : నాలుగు రోజుల ముచ్చట
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అత్యంత సంబరంగా జరపుకునే అతిపెద్ద పండుగ సంక్రాంతి. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. గొబ్బెమ్మలు, బొమ్మల కొలువులు భోగి మంటలు, గంగిరెద్దులు, పిండి వంటలు, హరిదాసు కీర్తనలు, రథం ముగ్గులు, కోడి పందేలు...కొత్త అల్లుళ్లు ఇలా సంకాంత్రి వచ్చిందంటే ఆ సందడే వేరు. దక్షిణ భారతదేశంలో పొంగల్‌ను నాలుగు రోజుల పాటు జరుపు కుంటారు, నాలుగు రోజుల ఈ వేడుకలో ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత. సంక్రాంతి సంబరాల్లో తొలి రోజును 'భోగి'గా పిలుస్తారు.ఈ భోగి పండుగకు ప్రత్యేకత ఉంది. రెండో రోజును 'మకర సంక్రాంతి'గా, మూడో రోజును 'కనుమ'గా పిలుస్తారు. నాలుగో రోజును 'ముక్కనుమ' అంటారు. సంక్రాంతికి ముందు రోజు జరుపుకునే భోగి: భగ అనే పదం నుంచి భోగి వచ్చిందంటారు పెద్దలు. దక్షిణాయనానికి చివరి రోజుగా భోగిని భావిస్తారు. అందుకే దక్షిణాయనంలో పడ్డ కష్టాలు, బాధలు తొలిగిపోవాలంటూ అగ్ని దేవుడికి భోగి మంట సమర్పించి రాబోయే ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలను ప్రసాదించాలని కోరుకోవడమే పరమార్థమే భోగి పండుగ విశిష్టత. తెల్లవారుఝామున నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం చేస్తారు తద్వారా చీడ పీడలు దోషాలు, తొలగిపోతాయని విశ్వాసం. భోగి అంటేనే భోగి మంటలు కదా. పాతకు బై ..బై... కొత్తకు ఆహ్వానం ఆవు పేడతో చేసిన పిడకలతో తెల్లవారుఝామునే భోగి మంటలు వేయడం అలవాటు. అంతేకాదు ఇంట్లోని పాత వస్తువులను కూడా భోగి మంటల్లో వేస్తుంటారు. ఈ ఆవు పిడకలను రకరకా పేర్లతో పిలుచుకుంటారు. ఇంకా మామిడి, రావి, మేడి చెట్ల అవశేషాలు, తాటాకులు లాంటివి భోగి మంటల్లో వేస్తారు. పాతను వదిలిపెట్టి, సరికొత్తమార్గంలోకి పయనించాలనేదే దీనర్ధం పరమార్థం. ముఖ్యంగా దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం ప్రారంభం కానుండటంతో.. కాలంతో వచ్చే మార్పులను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండాలని బోధించేదే భోగి పండుగ. అలాగే భోగి అనగానే గుర్తుకు వచ్చేది భోగి పళ్ళు. సాయంత్రం ఇంట్లోని చిన్న పిల్లలకు ముచ్చటగా భోగి పళ్లు పోసి, పేరంటాళ్లను పిలుచుకొని వేడుక చేసుకుంటారు. భోగి ముగిశాక సూర్యుడు దక్షిణాయణం నుంచి ఉత్తరాయణంవైపు, మకర రాశిలోకి అడుగుపెట్టిన సందర్భమే సంక్రాంతి సూర్యుడి పండుగ. ఏడాదిలో వచ్చే తొలి పండుగు. ఈ సంక్రాంతిలో "సం" అంటే మిక్కిలి "క్రాంతి" అంటే అభ్యుదయం. మంచి అభ్యుదయాన్ని ఇచ్చు క్రాంతి కనుక దీనిని "సంక్రాంతి" గా పెద్దలు చెబుతారు. సంక్రాంతికి పుణ్య దినం సందర్భంగా అడిగిన వారికి కాదనకుండా యధాశక్తి దానధర్మాలు చేయాలని భావిస్తారు. పుష్యమాసంలో వచ్చే ఈ పండుగకు ఇంటికి ధనధాన్య రాశులు రైతుల ఇళ్లకు చేరతాయి. పౌష్యలక్ష్మితో కళకళలతో ఇల్లిల్లూ ఒకకొత్త శోభతో వెలుగుతూ ఉంటుంది. అందుకే సంక్రాంతి రోజు మట్టి కుండలో కొత్త బియ్యం, బెల్లం,చెరకు కలిపి పొంగల్ చేస్తారు. ఈ పాలు ఎంత పొంగిపొర్లితే.. అంత సమృద్ధి , శ్రేయస్సును అని నమ్ముతారు. అంతేనా సంక్రాంతి ఈ పండుగ కొత్తబట్టలు కావాల్సిందే. ఇంకా పెద్దలకు నైవేద్యాలు, పితృతర్పణ లాంటివి ప్రధానంగా చెప్పుకోవాలి. శని దోషాలు తొలగిపోవాలని, నల్లనువ్వులతో సూర్యుడికి పూజలు, పితృదేవతలందరికీ తర్పణలిస్తుంటారు. ఇక పిండి వంటలతో ముఖ్యంగా అరిసెలు, నువ్వుండలు, సున్నుండలులాంటి స్వీట్లతోపాటు, జంతికలు చక్రాలతో అందరి ఇళ్ళు ఘుమ ఘుమ లాడుతూ ఉంటాయి. సంక్రాంతి అంటే ముగ్గూ ముచ్చట సంక్రాంతికి ముందే నెల పెట్టడం అని ముగ్గులు . ప్రతీ ఇల్లూ రంగు రంగుల రంగువల్లలతో కొత్త పెళ్లి కూతురులా ముస్తాబవుతుంది. పల్లెల్లో అయితే ఎవరుఎంత పెద్ద ముగ్గు పెడితే అంత గొప్ప అన్నట్టు. దీనిపై బాపూ లాంటి గీతకారులు కార్లూన్లు వేశారంటేనే అర్థం చేసుకోవచ్చు సంక్రాంతిలో ముగ్గుల హడావిడి. గోదావరి జిల్లాల్లో గొబ్బెమ్మలతో కన్నెపిల్లలు, చిన్న పిల్లల ముచ్చట చూసి తీరాల్సిందే. ఆడపిల్లలు ఆవు పేడతో చేసి పెట్టే గొబ్బెమ్మలు కృష్ణుని భక్తురాళ్ళైన గోపికలకు సంకేతం. ముగ్గు మధ్యలో పెద్ద గొబ్బెమ్మకి గుమ్మడి, మందార, బంతి, చామంతి పూలు పెట్టి పసుపూ కుంకాలతో అలంకరించి, తోటి స్నేహితులను పిలుచుకుని పాడుతూ వాటి చుట్టూ పాటలు పాడతారు. సుబ్బీ గొబ్బెమ్మా! మల్లెపువ్వంటీ మరదల్నివ్వవే, చామంతిపూవంటి చెల్లెల్నివ్వవే, మొగలీ పూవంటి మొగుణ్ణివ్వవే” అంటూ అమ్మాయిలు గొబ్బెమ్మలాడతారు. ఈ నెల రోజులూ గొబ్బెమ్మల సందడి ఉంటుంది. హరిలో రంగ హరీ అంటూ హరిదాసులు, గంగిరెద్దులు, కోడి పందాలు, జానపదుల జావళి సంక్రాంతి పండుగ. చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికీ తిప్పుతూ, డోలు, సన్నాయి రాగాలకు అనుగుణంగా అందంగా తలలూపుతూ చేసే నృత్యాలు..అబ్బో.. ఈ దృశ్యాలన్నీ చాలా రమణీయంగా ఉంటాయి. మూడో రోజు కనుమ: దీన్నే పశువుల పండుగ అని అంటారు. పశుపక్ష్యాదులకి గౌరవాన్ని సూచించే పండుగ వ్యవసాయ ఆధారమైన పల్లెల్లో పశువులే గొప్ప సంపద. రైతుకు ఎంతో ఆదరువు. చేతికొచ్చిన పంటను తామేకాక, పశువులూ, పక్షులూ పాలుపంచుకోవాలని పిట్టల కోసం ధాన్యపు కంకులు ఇంటి గుమ్మాలకు కడతారు. మెడలో గల్లుగల్లుమనే మువ్వల పట్టీలు పశువులకు చక్కగా అలకరించుకుంటారు. అందరూ కలిసి భోజనాలు చేస్తారు. గాలిపటాలు ఎగురవేస్తూ సరదాగా గడుపుతారు ముక్కనుమ:నాలుగో రోజైన ముక్కనుమ సంక్రాంతికి ముగింపు అనిచెప్పవవచ్చు. శాకాహారులు వివిధకూరగాయలో ముక్కల పులుసు చేసుకుంటూ, మాంసాహారులు నాన్‌వెజ్ వంటకాలతో విందు చేసుకుంటారు. ముక్కనమను తమిళులు ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజును కరినాళ్ అని పిలుస్తారు. పేరేదైనా.. సంబరం ఒకటే! ఆచారాలు, సాంప్రదాయాలు కాస్త భిన్నంగా ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా చాలా ఉత్సాహంతో జరుపుకునే పండుగు సంక్రాంతి. పశ్చిమ బెంగాల్లో పౌషా సంక్రాంతి, తమిళనాడులో పొంగల్, అస్సాంలో బిహు, గుజరాత్‌లోని ఉత్తరాయణ్, పంజాబ్‌లోని లోహ్రీ, అస్సాంలోని మాగ్ బిహు ఉత్సవాలు జరుపుకుంటారు. -
గొర్రెకు బదులు తమ్ముడి మెడ నరికేశాడు
మదనపల్లె: కనుమ పండుగ సంబరాల నేపథ్యంలో గొర్రె తల నరకడానికి బయలుదేరిన ఓ వ్యక్తి మద్యం మత్తులో క్షణికావేశానికి గురై వరుసకు తమ్ముడయ్యే యువకుడి మెడ నరికి హతమార్చిన ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం వలసపల్లెలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. వందలాదిమంది చూస్తుండగానే చోటుచేసుకున్న ఈ ఘటనలో తల తెగిన యువకుడు మరణించగా.. ఈ ఘాతుకానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మదనపల్లె రూరల్ సీఐ శ్రీనివాసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. వలసపల్లె గ్రామానికి చెందిన తలారి లక్ష్మన్న, గంగులమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు. భర్త లక్ష్మన్న ఎనిమిదేళ్ల క్రితం చనిపోగా పెద్ద కుమారుడు రాయలపేటలో కేబుల్ పని చేసుకుంటుండగా, రెండో కుమారుడు ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మూడో కుమారుడైన తలారి సురేష్ (26) అవివాహితుడు కావడంతో కూలి పనులు చేసుకుంటూ తల్లి వద్దే ఉంటున్నాడు. సురేష్‌కు వరుసకు పెదనాన్న కుమారుడైన తలారి చలపతి (55) కుటుంబం కూడా అదే గ్రామంలో ఉంటోంది. ఆ రెండు కుటుంబాల మధ్య చాలాకాలంగా స్వల్ప వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. కాగా, గ్రామంలో జరిగే కనుమ ఉత్సవాల్లో అమ్మవారికి జంతు బలులు ఇచ్చేటప్పుడు ఏటా తలారి చలపతి గొర్రె తల నరకడం ఆనవాయితీ. ఈ క్రమంలో ఆదివారం రాత్రి గ్రామమంతా కనుమ సంబరాల్లో హడావుడిగా ఉంది. గ్రామస్తులు రామాలయం నడి వీధిలో ఏర్పాటు చేసిన మండపం వద్ద అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తూ పూజలు చేయడంలో నిమగ్నమయ్యారు. మద్యం మత్తులో ఘాతుకం కాగా, తలారి సురేష్, అతడి పెదనాన్న కుమారుడు తలారి చలపతి ఆదివారం ఉదయం నుంచీ మద్యం మత్తులో తూగుతున్నారు. సంబరాల్లో భాగంగా అమ్మవారికి బలిచ్చే గొర్రెను మేళతాళాల మధ్య గ్రామంలో ఊరేగింపుగా ఇంటింటికీ తీసుకెళ్లి పూజలు చేయిస్తూ నడివీధికి తీసుకురావడం ఆనవాయితీ. ఈ క్రమంలో రాత్రి 8.30 గంటల ప్రాంతంలో సురేష్ డప్పు వాయిద్యాలకు అనుగుణంగా డ్యాన్సులు వేస్తూ గొర్రె వెంట బయలుదేరాడు. తలారి చలపతి చేతితో వేట కొడవలి పట్టుకుని గొర్రెతోపాటు నడుస్తుండగా రెండుమూడుసార్లు సురేష్ అతడిపై తూలిపడ్డాడు. ఆగ్రహించిన చలపతి అమ్మవారి గొర్రెకు చందాలు ఇచ్చే స్తోమత లేదు కానీ డ్యాన్సులు వేసేందుకు తక్కువ లేదంటూ విసుక్కున్నాడు. ఈ క్రమంలో ఇద్దరిమధ్యా చిన్నపాటి గొడవ జరిగింది. చలపతి డప్పుల వారిని నిలిపేయాల్సిందిగా ఆదేశించడంతో తాను డ్యాన్సు వేయాల్సిందేనని సురేష్ పట్టుపట్టాడు. దీంతో చలపతి ఆగ్రహానికి గురై చేతిలో ఉన్న వేట కొడవలితో ఒక్క ఉదుటున సురేష్ మెడపై నరికాడు. మెడ సగ భాగం వరకు తెగిపోయింది. ఊహించని ఈ హఠాత్పరిణామానికి గ్రామస్తులు భయకంపితులై ఇళ్లల్లోకి పరుగులు తీసి తలుపులు వేసుకున్నారు. రక్తపు మడుగులో గిలగిలా కొట్టుకుంటున్న సురేష్‌ను గ్రామస్తులు 108 అంబులెన్స్‌లో మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విపరీతమైన రక్తస్రావం కావడంతో అప్పటికే సురేష్ చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. చలపతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుడి అన్న లక్ష్మీనారాయణ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
ఒకే విస్తరిలో సకుటుంబం అరిటాకు భోజనం
-
పశువులను ప్రేమగా పూజించే పండగ
-
బంగార్రాజు సంక్రాంతి బరిలోకి దిగితే.. ఖేల్ ఖతం త్వరలో...
-
భోగిమంటలతో సంక్రాంతి సంబరాలు త్వరలో...
-
కనుమ అంటే..‘ముక్క’ పడాల్సిందే..తగ్గెదేలే త్వరలో...
-
గోమాతకు వందనం
సాక్షి, అమరావతి, నరసరావుపేట: రాష్ట్ర వ్యాప్తంగా గత 40–50 ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా శుక్రవారం కామధేను పూజ (గోపూజ) కార్యక్రమాలు శాస్త్రోక్తంగా, ఘనంగా కొనసాగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ), దేవదాయ శాఖల ఆధ్వర్యంలో కనుమ పండుగ రోజున ప్రజలను పెద్ద ఎత్తున భాగస్వాములను చేస్తూ పలు ఆలయాల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. గుంటూరు జిల్లా నరసరావుపేట మున్సిపల్ స్టేడియంలో ఉదయం 11.50 గంటలకు జరిగిన గోపూజ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంప్రదాయ పంచెకట్టు, కండువాతో పాల్గొన్నారు. స్వయంగా గోవుకు పసుపు పూసి, కుంకుమ బొట్లు పెట్టి అలంకరించారు. గోత్రనామంతో సంకల్పం చేసుకున్న అనంతరం టీటీడీ పండితుల మంత్రోచ్ఛారణ మధ్య గోమాతకు, దూడకు పట్టువ్రస్తాలు, పూలమాలలు సమర్పించారు. గోమాత, దూడకు ప్రదక్షిణ చేసి హారతి ఇచ్చి నమస్కరించుకున్నారు. పచ్చిమేత, అరటి పళ్లు తినిపించారు. ఈ కార్యక్రమంలో 108 గోవులకు గోపూజ నిర్వహించారు. 20 నిమిషాల పాటు సాగిన పూజా కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల, వినుకొండ, చిలకలూరిపేట తదితర నియోజవర్గాల నుంచి వేలాది మంది వచ్చారు. గోమాతకు పూలదండ వేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గోమాత గొప్పదనం తెలిసేలా.. ► తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనంలో ఉండే 50 ఆలయాలతో సహా మొత్తం 2,262 ఆలయాల్లో శుక్రవారం గోపూజ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. పలుచోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. గోమాత గొప్పదనం తెలిసేలా ఆయా ఆలయాల్లో పోస్టర్లను ప్రదర్శించారు. ► శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన గోపూజ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాసు పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది ఆలయంలో ఉదయం, సాయంత్రం మంత్రులు ఆదిమూలపు సురే‹Ù, చెల్లుబోయిన వేణు వేర్వేరుగా పూజల్లో పాల్గొన్నారు. ► అరసవెల్లి ఆలయంలో విద్యార్థులకు గోమాత ప్రాముఖ్యతపై వ్యాస రచన పోటీలు నిర్వహించారు. అందరికీ మంచి జరగాలి ► గోపూజ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పూజా కార్యక్రమం అనంతరం కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు వచ్చిన వారిని ఉద్దేశించి కాసేపు మాట్లాడారు. ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలను తెలియజేస్తూ.. ఈ సందర్భంగా రాష్ట్రంలో అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నానని చెప్పారు. ► సీఎం రాక సందర్భంగా నరసరావుపేట మున్సిపల్ స్టేడియంను సంక్రాంతి శోభ ఉట్టిపడేలా రంగవల్లులు, అలంకరణలతో తీర్చిదిద్దారు. బొమ్మల కొలువులు, గంగిరెద్దుల విన్యాసాలు, కోలాటాలు, హరిదాసుల కీర్తనలతో ఏర్పాటు చేసిన స్టాళ్లను, గోమాతలు, నందీశ్వరులు (ఎద్దు) అలంకరణలను సీఎం తిలకించారు. స్టాళ్లలో ఏర్పాటు చేసిన పిండి వంటలను రుచి చూశారు. ► టీటీడీ అర్చకులు, ఇస్కాన్ ప్రతినిధులు శేష వస్త్రంతో.. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గజమాలతో సీఎంను సత్కరించారు. ► ఈ కార్యక్రమంలో మంత్రులు వెలంపల్లి శ్రీనివాసరావు, మేకతోటి సుచరిత, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, శాసనమండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి, దేవదాయ శాఖ ప్రత్యేక కమిషనర్ అర్జునరావు, తదితరులు పాల్గొన్నారు. -
ఇంతకంటే సంతోషం ఏముంటుంది : మనోజ్
సంక్రాంతి పండగ సందర్భంగా హీరో మంచు మనోజ్‌కు సొంతూరు చిత్తూరు జిల్లాలోని రంగంపేటకు వెళ్లారు. ఈ క్రమంలో రంగంపేట చుట్టుపక్కల నుంచి ఆయనను చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. తనకోసం వచ్చిన అభిమానలకు బిల్డింగ్ పైనుంచి అభివాదం చేసిన మనోజ్.. వారికి కృతజ్ఞతలు తెలిపారు. తిరుపతి చుట్టుపక్కల జరిగే కనుమ పండగ ఎప్పటికీ గుర్తుండిపోతుందని మనోజ్ అన్నారు. సొంత ఊరిలో పండగ జరుపుకోవడం కంటే సంతోషం ఏముంటందన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను మనోజ్ ట్విటర్లో పోస్ట్ చేశారు. ‘మా ఊరు(రంగంపేట) చుట్టుపక్కల నుంచి ఏమి ఆశించకుండ ఇక్కడకు వచ్చి నాపై ప్రేమ కనబరుస్తున్నందకు సంతోషంగా ఉంది. నాకు ఆశీస్సులు అందజేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. లవ్ యూ ఆల్ సో మచ్’ అని మనోజ్ పేర్కొన్నారు. అలాగే రేణిగుంటలోని అభయక్షేత్రం అనాథశ్రమంకు వెళ్లిన మనోజ్ అక్కడి చిన్నారులతో సరదాగా గడిపారు. ఈసారి పండగ చాలా ప్రత్యేకమైనదని పేర్కొన్నారు. ఎంతో ప్రతిభగల చిన్నారులతో గడపటం చాలా ఆనందాన్ని ఇచ్చిందన్నారు. తన చివరి వరకు ఆ పిల్లల కోసం ఉంటానని చెప్పారు. Overwhelmed to receive such an unconditional love from people around my village ‘A-Rangampeta’❤😍 I am very thankful to each and everyone for showering their blessings on me 🙏🙏🙏 Love you all so much ❤ #Blessed pic.twitter.com/bZRq6iRibD — MM*🙏🏻❤️ (@HeroManoj1) January 16, 2020 Love u more thammudu .... thanks for ur love and blessings :) 🙏🏻❤️ https://t.co/zZeUKbQ6nk — MM*🙏🏻❤️ (@HeroManoj1) January 16, 2020 -
కనువిందుగా కనుమ పండుగ..
సాక్షి, విజయవాడ: కృష్ణా జిల్లాలో కనుమ పండుగ కనువిందుగా జరుగుతోంది. మరక దున్నెందుకు ఏడాదంతా చాకిరీచేసి సహకరించిన గోవులకు రైతులు పూజలు నిర్వహిస్తున్నారు. పంటలకు క్రిమికీటకాల బెడద తొలగించటంలో అండగా నిలిచే పక్షులకు ధాన్యాన్ని ఆహారంగా పెట్టి రుణం తీర్చుకొంటున్నారు. గ్రామాల్లో నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాల్లో పాల్గొని కనుమ కమనీయతను ఆస్వాదిస్తున్నారు ఈడుపుగల్లు, ఉప్పులూరు, గోడవర్రు, అంపాపురంలలో కోడిపందాలు జోరుగా సాగుతున్నాయి. సంప్రదాయబద్ధంగా సాగుతుండటంతో యువత పెంపుడు పుంజులను దింపి సై అంటున్నారు. చివరి రోజు కావటంతో రైతులు, మహిళలు, యువత పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ముగ్గుల పోటీలు, కోలాటాలు ఆకట్టుకుంటున్నాయి. పదేళ్ల తర్వాత సంపూర్ణ సంక్రాంతి సంబరాన్ని ఆస్వాదిస్తున్నామని రైతు కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. కనుమ సంబరాల్లో మంత్రి కొడాలి నాని, ఆయన కుమార్తె, కుమారుడు పాల్గొన్నారు. పెనమలూరు నియోజకవర్గంలో సంపూర్ణ సంక్రాంతి వేడుకలు సాగుతున్నాయి. సంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీలతో పాటు కోడిపందాల బరిలోనూ యువత మేమే సైతం అంటూ ముందుకొచ్చారు. ఇంత సరదాగా సంక్రాంతి జరుపుకోవడం చెప్పలేని ఆనందాన్ని కలిగిస్తోందని యువత అంటున్నారు. జగ్గయ్యపేట పాత గడ్డపై వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షులు చౌడవరపు జగదీష్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ఈ వేడుకల్లో వైఎస్సార్సీపీ యువ నేతలు సామినేని వెంకట కృష్ణప్రసాద్, ప్రశాంత్ బాబు, తన్నీరు నాగేశ్వరావు, తుమ్మల ప్రభాకర్, నూకల సాంబశివరావు, నూకల రంగా, నంబూరి రవి పాల్గొన్నారు. -
కనుమ రోజు సంక్రాంతి
సాక్షి, మెంటాడ: విజయనగరం జిల్లా మెంటాడ మండలంలోని గుర్ల గ్రామంలో సంక్రాంతి పండగను వినూత్నంగా జరుపుతారు. భోగి పండగను యధావిధిగా జరుపుకొని సంక్రాంతి పండగను మాత్రం కనుమ రోజు నిర్వహిస్తారు. కనుమ పండుగను ఆ మరుసటి రోజున చేసుకుంటారు. గ్రామంలో కాపు, వెలమ సామాజిక వర్గాలు భోగి మర్నాడు సంక్రాంతి పండగ నిర్వహించరు. కనుమ రోజు సంక్రాంతిని జరుపుతారు. దీనికి కారణాలు చెప్పలేకపోయినా ఇది తరతరాలుగా వస్తున్న ఆచారంగా వారు చెబుతారు. గండ్రేటి కుటుంబీకులు కోట గండ్రేటి నుంచి, పల్లి కుటుంబీకులు పల్లె గండ్రేడ నుంచి ఈ ప్రాంతానికి వచ్చారు. ఊర్లు మారినా వంశాచారాన్ని వారు వీడలేదు. గండ్రేటి వారు, పల్లివారు బంధువులు. గండ్రేటి వారి బాటలోనే పల్లి కుటుంబీకులు కూడా నడుస్తున్నారు. మృతి చెందిన పెద్దలు, పిన్నలకు కనుమ రోజున నైవేద్యం పెడతారు. మరునాడు (కనుమ) పశువులకు నూనె, పసుపు రాసి స్నానం చేయించి పూజలు చేస్తారు. వాటికి పిండి వంటలు పెడతారు. మిగిలిన వైశ్య, తెలగ, సామాజిక వర్గాలు మాత్రం సంక్రాంతిని యధావిధిగా భోగి పండగ తర్వాత జరుపుకొంటాయి. పండగ మార్పు తమకు ఆనందంగా ఉందని.. ఈ ఆచారాన్ని పాటించే కుటుంబాల మహిళలు తెలిపారు. తమ పుట్టింట్లో భోగి, సంక్రాంతి, కనుమ చేసుకొని అత్తింటికి సంక్రాంతి పండగకు వస్తారు. వారు జరుపుకొనే కనుమ పండుగకు పరిసరాల గ్రామస్తులు వస్తారు. సంక్రాంతి రోజు భోగి నారాయణపురంలో ఆచారం బలిజిపేట: నారాయణపురం దేవాంగుల వీధిలో సంక్రాంతి రోజు భోగి పండగ జరుపుకొంటారు. కొన్నేళ్ల క్రితం దేవాంగులకు చెందిన నేత మగ్గాలు, ఇతరత్రా సరుకులు నారాయణపురానికి చెందిన రైతులు భోగి మంటలో పడవేశారని.. ఆగ్రహించిన కూడా రైతుల నాగళ్లు, నాటుబళ్ల సామగ్రిని సంక్రాంతి రోజున భోగి మంటల్లో పడవేశారని స్థానికులు చెబుతున్నారు. అప్పటినుంచి నారాయణపురంలో మాత్రమే దేవాంగులు భోగి రోజు వేయాల్సిన మంటను సంక్రాంతి రోజు వేస్తుంటారని తెలిపారు. -
మజా చేశారు..
కనుమ.. మాంసాహార ప్రియులకు, మందుబాబులకు పెద్ద పండగ. మకర సంక్రాంతి మర్నాడు వచ్చే కనుమ నాడు పలువురు మాంసాహారాన్ని విధిగా ఆరగిస్తారు. అలాగే మద్యం అలవాటున్న వారు మిగతా రోజులకంటే కనుమ రోజు ఎక్కువగా సేవిస్తారు. కనుమ పండగ మంగళవారం కావడంతో మాంసాహార, మందుప్రియులు మస్తుగా మజా చేశారు. ఇలా జిల్లా, నగరవ్యాప్తంగా రూ.10 కోట్ల విలువైన మద్యాన్ని గటగటా తాగేశారు. రూ.8 కోట్ల విలువ చేసే నాలుగు లక్షల కిలోల చికెన్, 30 వేల కిలోల మటన్‌లను లాగించేశారు. ఔరా! అనిపించారు. సాక్షి, విశాఖపట్నం: మంగళవారం తెలవారగానే మాంసాహారులు దుకాణాల ముందు క్యూ కట్టారు. కిలోల కొద్దీ చికెన్, మటన్ కొనుగోలు చేశారు. మామూలు రోజుల కంటే దాదాపు రెట్టింపు మాంసాన్ని ఇళ్లకు తీసుకెళ్లారు. వీరి డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ దుకాణదారులు పెద్దమొత్తంలో కోళ్లను స్టాకు ఉంచుకున్నారు. జిల్లావ్యాప్తంగా (జిల్లా, నగరం కలిసి) ప్రతి ఆదివారం లక్షన్నర కోళ్ల వినియోగం జరుగుతుంది. ఒక్కో కోడి సగటున రెండు కిలోల బరువుంటుంది. ఈ లెక్కన మూడు లక్షల కిలోల చికెన్ అమ్ముడవుతుంది. అయితే కనుమ పండగ సందర్భంగా కోళ్ల ఫారాల నిర్వాహకులు రెండు లక్షల కోళ్ల (నాలుగు లక్షల కిలోలు)ను సిద్ధం చేశారు. జీవీఎంసీ పరిధిలో దాదాపు 1300 చికెన్ దుకాణాల ద్వారా ఈ కోళ్లన్నీ మంగళవారం మధ్యాహ్నానికే అమ్ముడైపోయాయి. బ్రాయిలర్ చికెన్ కిలో స్కిన్‌తో రూ.150, స్కిన్లెస్ రూ.160 ధరను నిర్ణయించారు. కానీ చాలామంది కిలో స్కిన్‌తో రూ.170, స్కిన్లెస్ను రూ.180కి అడ్డగోలుగా పెంచేసి సొమ్ము చేసుకున్నారు. సోమవారం సంక్రాంతి సందర్భంగా పత్రికలకు సెలవు కావడంతో మంగళవారం పేపర్లు మార్కెట్లోకి రాలేదు. దీంతో చికెన్ ధరలు వినియోగదార్లకు తెలియకుండా పోయాయి. దీన్ని ఆసరాగా చేసుకుని కిలోకు రూ.20లు అదనంగా పెంచి విక్రయించారు. ఇలా సగటున కిలో ధర రూ.150 చొప్పున చూసినా రూ.6 కోట్ల విలువైన చికెన్ అమ్మకాలు జరిపారు. గత ఏడాదికంటే ఈ కనుమ పండగకు చికెన్ అమ్మకాలు పెరిగాయని బ్రాయిలర్ అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ విశాఖ అధ్యక్షుడు ఆదినారాయణ ‘సాక్షి’కి చెప్పారు. మటన్ అమ్మకాలకూ ఊపు.. మరోవైపు కనుమ పండగకు మటన్ అమ్మకాలు బాగానే జరిగాయి. జిల్లాలోనూ, నగరంలోనూ వెరసి మంగళవారం ఒక్కరోజే 30 వేల కిలోలకు పైగా మేకమాంసం విక్రయించినట్టు అంచనా. కిలో మటన్ రూ.600 ధర నిర్ణయించారు. ఈ లెక్కన దాదాపు రూ.2 కోట్ల విలువైన మేకమాంసం అమ్ముడుపోయింది. నగరంలో దాదాపు 750 మటన్ దుకాణాలున్నాయి. ఆయా ప్రాంతాల్లో మటన్ కోసం నగర జనం ఎక్కడికక్కడే బారులు తీరుతూ కనిపించారు. గ్లాసులు గలగల.. ఇక కనుమ పండగ రోజున మందుబాబులు ‘మత్తు’గా మజా చేశారు. ఈ రోజు కోసమే వారు ఎన్నాళ్లగానో ఎదురు చూస్తున్నట్టుగా కనిపించారు. కనుమ పండగను అమ్మకాల జోరును ఊహించిన మద్యం దుకాణదార్లు రెట్టింపు స్టాకును అందుబాటులో ఉంచారు. మందుప్రియులు ఎంజాయ్ చేయడానికి నాలుగైదు రోజుల ముందుగానే లిక్కర్‌ను సిద్ధం చేసుకున్నారు. మరికొంతమంది స్నేహితులను కూడా సమకూర్చుకున్నారు. కొంతమంది ఇళ్లలోనూ, మరికొందరు మద్యం దుకాణాలు, ఇంకొందరు హోటళ్లు, బార్లలోనూ మందులో మునిగితేలారు. పలువురు మధ్యాహ్నానికే మద్యం బాటిళ్లను తెరిచేశారు. అలా రాత్రి వరకూ మద్యసేవనంలోనే ఉన్నారు. విశాఖ జిల్లాలోను, నగరంలోనూ కలిపి 401 మద్యం షాపులు, 124 బార్లు ఉన్నాయి. రోజుకు వీటి ద్వారా సగటున రూ.6 కోట్ల విలువైన మద్యం (లిక్కర్, బీరు) విక్రయాలు జరుగుతాయి. అయితే కనుమ పండగ సందర్భంగా దాదాపు రూ.10 కోట్ల విలువైన మందు అమ్ముడుపోయినట్టు అంచనా వేస్తున్నారు. విశాఖ జిల్లాలో మూడు ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయాల పరిధి ఉంది. వీటిలో విశాఖ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలోనే ఎక్కువగా మద్యం అమ్మకాలు జరిగినట్టు తెలుస్తోంది. మొత్తమ్మీద కనుమ పండగ సందర్భంగా కేవలం మద్యం, మాంసాలకు విశాఖ నగర, జిల్లా వాసులు రూ.18 కోట్ల వరకు వెచ్చించారన్న మాట! -
విందుకు వేళాయె.!
పెదవాల్తేరు(విశాఖతూర్పు): సంక్రాంతి సీజన్ వచ్చిందంటే చాలు చికెన్, మటన్‌కు ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదు. ముఖ్యం గా కనుమ రోజున మాంసాహారానికి ప్రాధాన్యమిస్తారు. ప్రస్తుతం కిలో మటన్ ధర రూ.600గా ఉంది. ఇక చికెన్ స్కిన్‌తో కిలో రూ.160గానూ, స్కిన్ లెస్ అయితే రూ.170 గా ఉంది. జీవీఎంసీ పరిధిలో దాదాపుగా 1300 వరకు చికెన్ దుకాణాలు ఉన్నాయి. ఈ దుకాణాల ద్వారా రోజుకు దాదాపుగా 10 వేల కిలోల వరకు చికెన్ అమ్మకాలు జరుగుతున్నాయి. ఫలితంగా చికెన్ వ్యాపారులకు రోజుకు రూ.18 లక్షల వరకు ఆదాయం వస్తోంది. జీవీఎంసీ పరిధిలో నమోదైన 750 వరకు మటన్ దుకాణాలు ఉన్నాయి. ఈ దుకాణాల రోజూ 5 వేల కిలోల వరకు మటన్ విక్రయిస్తున్నారు. మరో 250 దుకాణాల ద్వారా వెయ్యి కిలోల మటన్ విక్రయమవుతోంది. ఇక విశాఖ నగరం, జిల్లాలోను కలిపితే రోజూ లక్ష నుంచి 1.25 లక్షల కిలోల చికెన్ విక్రయాలు జరుగుతున్నాయి. కాగా, కనుమ సీజన్ కావడంతో ఈ వినియోగం నాలుగు లక్షల కిలోలకు పెరుగుతుందని అంచనా. మంగళవారం జరిగే కనుమ పండగను దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని కోళ్ల ఫారాల్లో సుమారుగా మూడు లక్షల ఫారం కోళ్లను సిద్ధం చేశారని సమాచారం. దీంతో నాలుగు లక్షల కిలోల చికెన్ అందుబాటులో ఉంటుంది. మందుబాదుడు పండగ సీజన్లో మద్యం ఏరులై పారుతుంది. మద్యం సిండికేట్ యాజమాన్యం భోగి రోజునే క్వార్టర్‌కు రూ.15 వంతున వడ్డించిందని మందుబాబులు ఆందోళన వ్యక్తం చేశారు. భోగికే బాదుడు ఇలా ఉంటే, సంక్రాంతి, కనుమ రోజు ఇంకెలా ఉంటుందోనని మందుబాబులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఎంఆర్పీ కట్టుదిట్టంగా అమలు చేస్తామన్న ఎక్సైజ్‌శాఖ అధికారులు పట్టించుకోనందునే మద్యం వ్యాపారుల ఆటలు సాగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మద్యం అమ్మకాల ద్వారా నగరంలో రోజూ రూ.1.50 కోట్లు, జిల్లాలో రూ.2 కోట్ల ఆదాయం వస్తోంది. పెద్ద పండగ దృష్ట్యా బార్లు, మద్యం దుకాణాల నిర్వాహకులు రెండు రోజులకు సరిపడా స్టాకును ముందే సిద్ధం చేసుకున్నారు. నగరంలో 154 మద్యం దుకాణాలు, 114 బార్లు ఉన్నాయి. సాధారణ రోజుల్లో దాదాపుగా 3 వేల మద్యం కేస్లు, 1500 కేస్ల బీర్లు విక్రయిస్తున్నారు. డిసెంబర్ 30, 31 తేదీల్లో నగరవ్యాప్తంగా రూ.10 కోట్ల మేరకు మద్యం విక్రయించారు. ఇక జిల్లాలో రూ.15 కోట్ల మేరకు ఆదాయం వచ్చింది. సంక్రాంతి సీజన్లో నగరంలో రూ.15 కోట్లు, జిల్లాలో రూ.20 కోట్ల మేరకు మద్యం వ్యాపారం జరుగుతుందని అంచనా. -
పశువును కనుము
సంక్రాంతి మూడవరోజును ‘కనుము’గా నిర్థారించారు మన పెద్దలు. ‘కనుము’ నేరుగా పండుగ కాదని పండుగను అనుసరించి వచ్చే పండుగ రోజు అని చెబుతారు. ‘కనుము’ అంటే ‘జాగ్రత్తగా చూడు’ అని అర్థం. అంటే ఆరోగ్యాన్ని జాగ్రత్తగా పరిశీలించుకోవలసిన రోజులు అనే అర్థం కూడా వస్తుంది. ‘కనుము’ వ్యావహారికంలో ‘కనుమ’ అయ్యింది. కనుము అనే మాటకి పశువు అనే అర్థం కూడా చెబుతారు. అందుకని దీనిని పశువుల పండుగగా జరపడమనేది తెలుగు ప్రాంతంతో పాటు తమిళనాట ఉంది. పాడిపంటలలో తోడ్పడే పశువులను ‘చూడండి’, సత్కరించండి అనే అర్థం ‘కనుము’లో ఉంది. సూర్యుడు దక్షిణాయనంలో నుంచి ఉత్తరాయణంలోకి తొంగి చూశాడు కనుక ‘కనుము’ అయ్యిందని కూడా అంటారు. సంక్రాంతి ఉత్తరాయణానికి మొదటి రోజు. ఉత్తరాయణం – దేవతలకు ప్రీతికరమైన కాలం. ఒకవైపు ఇలా పుణ్యకాలం కావడం మరో వైపు పంటలు వచ్చే సమయం కాబట్టి ఈ సంబరమంతా ఒకరోజులో ముగిసేది కాదు కనుక ‘కనుము’ ఒక కొనసాగింపు పండగరోజు అయ్యింది. ఇంటికి వచ్చిన బంధుమిత్రులెవరూ కదలకుండా ఉండాలనే ఉద్దేశంతో ‘కనుము పండుగ నాడు కాకులు కూడా కదలవని’ శాస్త్రం పెట్టారు. పశువులను పూజించాలి: ‘గవామంగేషుతిష్ఠంతి భువనాని చతుర్దశ’.... అంటే ముక్కోటి దేవతలు, 14 లోకాలు గోవుల శరీరంలో ఉంటాయని శాస్త్రం చెబుతోంది. గో శబ్దానికి ఎద్దులు అనే అర్థం కూడా ఉంది. అనేక పూజలు పురస్కారాలకు పశువులను ఆదిమానవుడి దగ్గర నుంచి ఉపయోగిస్తూనే ఉన్నాం. ఎద్దులతో వ్యవసాయం చేసి ఆహారం పొందగలుగుతున్నాం. అందువల్ల ఉత్తరాయణ పుణ్యకాలంలో పశువుల్ని కూడా భక్తిగా కొలుచుకోవడం ఆచారంగా వస్తోంది. పూర్వకాలంలో ప్రభువులు పశువులను కడిగి, కొమ్ములకు అలంకరించి, అలంకరణ (బంగారు డిప్పలు) కాళ్ల గిట్టలకు వెండి తొడుగులు మెడలో వెండి మువ్వలు వేసినట్లు కావ్యాలు చెబుతున్నాయి. పట్టు వస్త్రాలు కప్పడం, పసుపుకుంకుమలతో పూజించడం, కొత్త ఎడ్లకు గడ్డి వేసి, ఆహార పదార్థాలు ఇవ్వడం, ఆ రోజు హుషారుగా పరుగులు తీసేలా చూస్తూ పశువులకు కూడా పండుగ చేస్తారు. సంక్రాంతికి పంటలు చేతికి వస్తాయి. ఇళ్లన్నీ సిరిసంపదలతో తులతూగుతూంటాయి. ఇంత సంపన్నులు కావడానికి మూలమైన వారిని జాగ్రత్తగా చూసుకోమని అంటే వారి కోసం పండగ చేయాలి అనే అర్థంలో కనుము పండుగ ఏర్పడింది. రైతన్నకి పశువులంటే పంచప్రాణాలు. అందుకే కనుమునాడు పశువుల్ని అలంకరిస్తారు. కొత్త బియ్యంతో పొంగలి వండుతారు. ఆ పొంగలిని పశువులకే నివేదన చేస్తారు రైతులు. అంటే పశువుల ద్వారా లభించిన ధాన్యాన్ని, ఆ పశువులకే తొలి నైవేద్యంగా పెట్టి, పశువుల పట్ల కృతజ్ఞతను తెలియచేసుకుంటారు రైతులు. అలాగే కనుమ నాడు కాకులకు ఆహారం తప్పనిసరిగా పెట్టడం ఆచారంగా వస్తోంది. పక్షులకు సైతం...: కనుమును తమిళులు మాట్టు పొంగలి అంటారు. మాట్టు అంటే పశువు. అందుకే కనుము అంటే పశువులకి చేసే ముఖ్యమైన పండుగగా భావిస్తారు. రైతులకు పక్షులతో కూడా అవినాభావ సంబంధం ఉంది. అందుకే సంక్రాంతి సమయంలో ఇంటి చూరుకు లేదా గుమ్మాలకు వరిధాన్యం కంకులు వేలాడదీస్తారు. కనుము నాడు గోపూజ చేయడంతో పాటు, గోకల్యాణం కూడా చేస్తారు. పూర్వం ఈ పండుగనాడు పశువులకు ప్రత్యేకమైన ఆహారం తయారుచేసి తినిపించేవారు. ఇందుకోసం... ప్రతి ఇంటివారు తెల్లవారుజామునే కత్తి, సంచి తీసుకుని దగ్గరలో ఉన్న అడవికి వెళ్లేవారు. మద్దిమాను, నేరేడు మాను చెక్క, మోదుగపూలు, నల్లేరు, మారేడు... వంటి కొన్ని మూలికలను సేకరించి, చిన్నచిన్న ముక్కలుగా చేసి, పెద్ద మొత్తంలో ఉప్పు జత చేసి, రోట్లో వేసి దంచేవారు. ఆ పొడిని ఉప్పు చెక్క అంటారు. దీనిని పశువులకు తినిపించాలి. వాస్తవానికి ఈ చెక్క పొడిని తినడానికి పశువులు ఇష్టపడవు. అతి కష్టంతో ఒక్కొక్క దాని నోటిని తెరిచి చారెడేసి ఉప్పు చెక్కను నోట్లో పోసి మూస్తారు. ఇలా రెండు మూడు దోసెళ్లు పోస్తారు. ఏడాదికోసారి ఉప్పుచెక్కను తినిపిస్తే పశువులు ఆరోగ్యంగా ఉంటాయని వీరి నమ్మకం. ఉప్పు చెక్క తినిపించాక, వీటికి పరిశుభ్రంగా స్నానం చేయిస్తారు. కొమ్ములను అందంగా చెక్కి, రంగులు పూస్తారు. కోడెదూడల కొమ్ములకు తొడుగులు తొడిగి, మువ్వల పట్టీలు, మూతికి మూజంబరాలు అలంకరిస్తారు. ఈ సమయంలో చేలన్నీ పంటలు కోసి ఖాళీగా ఉండటంతో, వీటిని పొలాల్లోకి వదిలేస్తారు. పశువులన్నీ స్వేచ్ఛగా పొలాలలో పరుగులు తీసి పరవశించడం కనులారే చూసే పండుగే కనుము. -
పల్లె జీవనశైలిలో నేడు కనుమ పండుగ
-
వేడుకగా శ్రీవారి పారువేట ఉత్సవం
సాక్షి,తిరుమల: తిరుమల క్షేత్రంలో శనివారం శ్రీవారి పారువేట ఉత్సవాన్ని కన్నుల పండువ గా నిర్వహించారు. జగత్ప్రభువైన శ్రీనివాస చక్రవర్తి శంఖ, చక్ర, గదా, ధనుః, ఖడ్గం..అనే పంచాయుధాలు ధరించి వన విహారార్థం వెళ్లి దుష్ట మృగాలను వేటాడి విజయగర్వంతో తిరిగిరావటమే ఈ ఉత్సవ విశిష్టత. ప్రతి సంవత్సరం కనుమ పండుగ రోజు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఆయుధధారుడైన స్వామి బంగారు పీఠంపై ఆలయం నుంచి ఊరేగింపుగా బయలుదేరారు. మరో బంగారు పీఠంపై శ్రీకృష్ణ స్వామి కూడా శ్రీనివాస ప్రభువును అనుసరించగా బాజా భజంత్రీ, పండితుల వేదఘోష నడుమ మధ్యాహ్నం 2 గంటలకు ఆలయానికి మూడు మైళ్ల దూరంలోని పారువేట మంటపానికి చేరుకున్నారు. స్వామివారు పంచాయుధాలను ఎక్కుపెట్టి పరుగెడుతుండగా, ఆలయ అర్చకుడు ఏ.అనంతశయన దీక్షితులు వెండి బల్లెం(ఈటె)తో శ్రీస్వామివారిని అనుసరిస్తూ జంతువుల (నమూనా బొమ్మలు)ను వేటాడారు. అంతకుముందు పూర్వవృత్తాంతం ప్రకారం కృష్ణ స్వామివారు అక్కడే ఉన్న సన్నిధిగొల్ల విడిది కేంద్రానికి వెళ్లి వెన్నను ఆరగించారు. చివరగా శ్రీనివాసుడు, శ్రీకృష్ణ స్వామివారు ప్రత్యేక హారతులు అందుకుని భక్తులకు దర్శనమిస్తూ సాయంత్రం 4.45 గంటలకు ఆలయానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఈవో సాంబశివరావు, డెప్యూటీఈవో చిన్నంగారి రమణ పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా గోదాదేవి పరిణయోత్సవం తిరుమల ఆలయంలో శనివారం గోదాదేవి పరిణయోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించారు. మరోవైపు వైఖానస ఆగమోక్తంగా ‘కాకబలి’ నివేదన నిర్వహించారు. కనుమ పండుగ వేకువజాము తోమాల సేవ పూర్తి అయిన తర్వాత కొలువు సేవకు పసుపు, కుంకుమ వేర్వేరుగా కలిపిన అన్నప్రసాదాన్ని ఆనంద నిలయంపై కొలువైన విమాన వేంకటేశ్వరునికి నివేదనగా సమర్పించారు. తిరుమలలో పోటెత్తిన భక్తులు తిరమలలో శ్రీవారి దర్శనానికి శనివారం భక్తులు పోటెత్తారు. సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 57,831 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. -
కనుమ సందడి
తమిళనాట శుక్రవారం కనుమ పండుగ సందడి నెలకొంది. గ్రామగ్రామాన మూగజీవాలను పూజించారు. శనివారం కానం పొంగల్ సందర్భంగా జన సందోహం పర్యాటక, వినోద కేంద్రాలకు తరలి రానుంది. దీంతో చెన్నైని నీఘా నీడలోకి తెచ్చారు. మెరీనా, బీసెంట్ నగర్ బీచ్‌లలో పర్యాటకులపై ఆంక్షలు విధించారు. సాక్షి, చెన్నై: సంక్రాంతి సంబరాల్లో భాగంగా రాష్ట్ర ప్రజలు శుక్రవారం కనుమ పర్వదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. తమకు జీవనాధారంగా ఉన్న పశువులను రైతులు భక్తిశ్రద్ధలతో పూజించారు. ఆశ్రమాల్లో, గో మందిరాల్లో ఉదయాన్నే గోమాతలకు స్నానాలు చేయిం చారు. కొమ్ములకు కొత్త రంగులు వేశారు. వివిధ రంగులు, బెలూన్లు, గజ్జెలతో అలంకరించారు. పండ్లు నైవేద్యంగా సమర్పించారు. చెన్నై మెరీనా తీరంలోకి తమ పశువుల్ని పెంపకదారులు తోలుకు వచ్చారు. వాటికి సముద్ర స్నానం చేయించిన అనంతరం పూజలు నిర్వహించారు. ఎడ్ల బండ్లతో పురవీధుల్లో చక్కర్లు కొట్టారు. జనానికి వినోదాన్ని పంచి పెట్టారు. పెద్ద పండుగలో మూడు ముఖ్య ఘట్టాలు ముగిశా యి. ఇక చివరగా కానం పొంగళ్ శనివారం ఘనంగా జరగనుంది. నేడు కానం పొంగల్ కానం పొంగల్ అంటే అందరికీ మహదానందం. ఇంటిల్లిపాదీ పర్యాటక ప్రాంతాలకు తరలి వెళ్లి ఈ పండుగను ఉత్సాహంగా జరుపుకుంటారు. వీరి కోసం పర్యాటక ప్రాంతాలు, వినోద కేంద్రాలు ముస్తాబ య్యాయి. ఒక్క చెన్నై నగరంలో రెండు వందల ప్రత్యేక బస్సుల్ని నడిపేందుకు నగర రవాణా సంస్థ నిర్ణయించింది. ఆయా మార్గాల్లో ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ప్రత్యేక బస్సులు తిరగనున్నాయి. జనం అత్యధికంగా తరలివచ్చే మెరీనా, బీసెంట్ నగర్ బీచ్‌ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సముద్రంలోకి ఎవరినీ వెళ్లనీయకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు. సముద్ర స్నానాన్ని నిషేధించారు. సందర్శకుల భద్రత నిమిత్తం పోలీసులు యంత్రాంగం గట్టి భద్రతా చర్యలు తీసుకుంది. ప్రత్యేక హెల్ప్ లైన్లను ఏర్పాటు చేశారు. తప్పిపోయిన వారిని రక్షించేందుకు, జేబు దొంగల భరతం పట్టేం దుకు ప్రత్యేకంగా మఫ్టీలో సిబ్బందిని రంగంలోకి దించనున్నారు. అదే విధంగా చెన్నై నగరంలోని గిండి చిల్డ్రన్స్ పార్కు, వండలూరు జూ తదితర ప్రాంతాలు పర్యాటకుల కోసం ముస్తాబయ్యాయి. జనం నగరంలోని పర్యాటక, వినోద కేంద్రాలకు తరలి రానుండడంతో భద్రత నిమిత్తం 18 వేల మందిని రంగంలోకి దించారు. అలాగే ప్రత్యేక మొబైల్ టీమ్‌లను సైతం ఏర్పాటు చేశారు. -
అలంగానల్లూరులో ‘జల్లికట్టు’
-
కనుల పండువగా కుంకుమార్చన
ఎచ్చెర్ల, న్యూస్‌లైన్ : కుంచాలకుర్మయ్యపేట గ్రామంలోని శ్రీచక్రపురం గురువారం భక్తులతో కిటకిటలాడింది. కనుమ పండుగ సందర్భంగా అమ్మవారికి ఘనంగా కుంకుమపూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నాలుగు గంటల నుంచే భక్తులు తరలివచ్చి పూజల్లో పాల్గొన్నారు. శ్రీచక్రార్చన, విశేష పూజలు ఆలయ వ్యవస్థాపకుడు బాలభాస్కరశర్మ ఆధ్వర్యంలో జరిగాయి. శివాలయం, బాబా మందిరంలో రుత్వికులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాలభాస్కరశర్మ మాట్లాడుతూ కనుమ రోజున ప్రతి జీవిలోను భగవతస్కారం ఉంటుందన్నారు. అందు కే పూర్వికులు కనుమ రోజున పశువులకు పిండివంటలు పెట్టేవారని, అయితే ఇప్పుడు ఆ సంప్రదాయాలను పక్కన పెడుతున్నారన్నారు. లలితా సహస్రనామాలతో ఆరు వందల మంది మహిళలతో కుంకుమార్చన చేయించారు. అనంతరం ఖడ్గమాల లలితా పారాయణం జరిగింది. 13 వందల మంది భక్తులకు అన్న సంతర్పణ చేయించారు. కార్యక్రమంలో రుత్వికులు ఎం.సంతోష్‌కుమార్, విశ్వనాథ్‌శర్మ, అనంతశర్మ, టి.రమేష్, బాబి, నారాయణరావు, అయ్యప్పశ్రీను పాల్గొన్నారు.