
బోల్డ్ కంటెంట్‌తో భారీ హిట్‌లు కొడుతున్నారు నూతన దర్శకులు. ఒక్క సినిమాతోనే మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లోకి వెళ్తున్నారు. అర్జున్ రెడ్డి, ఆర్‌ఎక్స్ 100 సినిమాలతో సందీప్ రెడ్డి వంగా, అజయ్ భూపతి తమ స్టామినా ఏంటో నిరూపించారు. ఈ రెండు సినిమాలు టాలీవుడ్‌లో కలెక్షన్ల వర్షం కురిపించాయి. అయితే అర్జున్‌రెడ్డి సినిమాను తమిళ, హిందీ భాషల్లో రీమేక్ చేస్తోన్న విషయం తెలిసిందే.
ఇక ఆర్ ఎక్స్ 100 మూవీని కూడా తమిళ్‌లో తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో హీరోగా ఆది పినిశెట్టి నటించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు దర్శకుడు, ఇతర నటీనటులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఈ సినిమాకు హీరోయిన్‌గా ఎవరు నటించనున్నారన్న వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది. ఎందుకంటే ఆర్‌ఎక్స్ 100తో పాయల్ రాజ్‌పుత్ తెలుగునాట పాపులర్ అయిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment