ఒకింత భయపెడుతున్న ‘క్లాప్‌’ టీజర్‌, హీరోకి ఏమైంది.. | Chiranjeevi Launches Aadhi Pinisetty Clap Movie Teaser | Sakshi
Sakshi News home page

చిరంజీవి చేతుల మీదుగా ఆది పినిశెట్టి క్లాప్‌ టీజర్‌

Published Mon, Sep 6 2021 7:21 PM | Last Updated on Mon, Sep 6 2021 7:24 PM

Chiranjeevi Launches Aadhi Pinisetty Clap Movie Teaser - Sakshi

ఆది పినిశెట్టి,  ఆకాంక్ష సింగ్ హీరోహీరోయిన్లుగా పృథ్వీ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘క్లాప్’. సర్వాంత రామ్ క్రియేషన్స్, షిరిడి సాయి మూవీస్‌, బిగ్ ప్రింట్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. షూటింగ్‌ను పూర్తి చేసుకుని పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ టీజర్‌ను కొద్దిసేపటి క్రితం మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. 

తనకి అత్యంత సన్నిహితుడు అయిన రవి రాజా పినిశెట్టి కొడుకు ఆది పినిశెట్టి తన ఫ్యామిలీ మెంబర్స్‌లో ఒకడని. ఈ ‘క్లాప్’ టీజర్‌ను విడుదల చేయడం తనకి చాలా సంతోషాన్నిచ్చిందన్నారు. ఖచ్చితంగా ఈ మూవీ పెద్ద హిట్ అవుతుందంటూ  చిత్రబృందానికి చిరు అభినందనలు తెలిపారు.  ఇక టీజర్ విషయానికి వస్తే.. ఆది పినిశెట్టి ఈ చిత్రంలో రన్నింగ్ రేసర్‌గా కనిపించబోతున్నాడు. నేషనల్ లెవెల్ రన్నింగ్ కాంపిటిషన్‌లో పాల్గొని విజేతగా నిలవాలని పరితపించే ఓ కుర్రాడిగా కనిపిస్తున్నాడు.

అయితే అతనికి ఆవేశం కూడా ఎక్కువే. అందుకే గొడవలు పడుతున్నట్టు ఈ టీజర్లో చూపించారు.అలాగే ఆకాంక్ష సింగ్‌తో లవ్‌ ట్రాక్‌ను ఆసక్తిగా చూపించారు. టీజర్ చివర్లో ఆది .. ఒక కాలుతో మాత్రమే కనిపిస్తుండడం అందరినీ ఆలోచనలో పడేసిందని చెప్పాలి. హీరో ఏ కారణంతో తన కాలుని కోల్పోయాడు అనే విషయాన్ని సస్పెన్స్‌ నిస్తూ మేకర్స్‌ టీజర్‌ను వదిలారు. తెలుగు, తమిళ భాషలో తెరకెక్కిన ఈ చిత్రంలో  బ్రహ్మాజీ, నాజర్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తు‍న్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement